Share News

ఎంఆర్‌ నగరం ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్తా

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:54 AM

మండలంలోని ఎంఆర్‌నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్తానని టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్‌ అన్నారు.

 ఎంఆర్‌ నగరం ఘటనను సీఎం దృష్టికి తీసుకువెళ్తా
టీడీపీ నాయకులను పరామర్శిస్తున్న పరిశీలకుడు రత్నాకర్‌

-టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు రత్నాకర్‌

పార్వతీపురం రూరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని ఎంఆర్‌నగరంలో తెలుగుదేశం పార్టీ నాయకులపై వైసీపీ నాయకుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దీనిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకొని వెళ్తానని టీడీపీ జిల్లా ఎన్నికల పరిశీలకుడు దాడి రత్నాకర్‌ అన్నారు. వైసీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎంఆర్‌నగరం సర్పంచ్‌ అభ్యర్థి సుభద్రమ్మతో పాటు టీడీపీ నాయకులు ఆర్‌.తిరుపతిరావు, ఆర్‌.ప్రభాకరరావు తదితరులను ఆయన గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేంద్రియ వ్యవసాయ పరిశీలకులుగా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వారు ఎన్నికల్లో ఏజెంట్లగా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ‘ఎంఆర్‌ నగరంలో పి.మదన్‌, ఆర్‌.మంగ సేంద్రియ వ్యవసాయ పరిశీలకులుగా పని చేస్తున్నారని, మదన్‌ వైసీపీ తరపున ఏజెంట్‌గా ఉన్నట్టు నా దృష్టికి వచ్చింది. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తాం. టీడీపీ నాయకులపై దాడులు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం రాత్రి పది గంటల తర్వాత వారిని విడిచిపెట్టడం ఏమిటి. ఓటు వేసేందుకు వారిని పోలీసులు స్వయంగా తీసుకువచ్చి మళ్లీ తీసుకొని వెళ్లాలి. రాత్రి సమయంలో గ్రామంలో విడిచిపెట్టడం పద్ధతి కాదు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎస్పీ మాధవరెడ్డి దృష్టికి తీసుకొని వెళ్తా. టీడీపీ నాయకులపై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.’అని డిమాండ్‌ చేశారు. ఈ కార్య క్రమంలో ఎంపీపీ బోనుదేవి చంద్రమౌళి, టీడీపీ సీనియర్‌ నాయకుడు వి.త్రినాథ్‌నాయుడు, మాజీ సర్పంచ్‌ వి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2026 | 12:54 AM