Share News

అధికారుల తీరు వల్లే నాకు 9వ ర్యాంక్‌

ABN , Publish Date - Jun 23 , 2026 | 12:10 AM

నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న కొంత మంది అధికారుల అలసత్వం వల్ల నష్టం జరుగుతోంది.. వారి కారణంగా రాష్ట్రస్థాయితో తాను తొమ్మిదో ర్యాంక్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఎమ్మెల్యే బేబీనాయన ఆవేదన వెలిబుచ్చారు.

అధికారుల తీరు వల్లే నాకు 9వ ర్యాంక్‌
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ పరిధిలో పనిచేస్తున్న కొంత మంది అధికారుల అలసత్వం వల్ల నష్టం జరుగుతోంది.. వారి కారణంగా రాష్ట్రస్థాయితో తాను తొమ్మిదో ర్యాంక్‌కు పరిమితం కావాల్సి వచ్చిందని ఎమ్మెల్యే బేబీనాయన ఆవేదన వెలిబుచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారం లోనికి వచ్చిన రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక ఓ ప్రైవేట్‌ రెసిడెన్సీలో సోమవారం విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 90 శాతం మంది అధికారులు బాగానే పని చేస్తున్నప్పటికీ, 10 శాతం మంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మాటను సాక్షాత్తూ సీఎం చంద్రబాబు తన వద్ద ప్రస్తావించార న్నారు. పనిచేయడం ఇష్టం లేని అధికారులు నియోజకవర్గం నుంచి వేరే ప్రాంతాలకు వెళ్లి పోవచ్చన్నారు. చంద్రబాబు కార్యదక్షత, అనుభవం, సమర్ధత, విజన్‌ కారణంగా రెండేళ్లలో ఎన్నో అద్భుతాలు సృష్టించారన్నారు. చంద్రబాబు, పవన్‌, లోకేశ్‌ రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్నార న్నారు. వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిపోయిన నిధులను తిరిగి రప్పించలిగామన్నారు. సువర్ణముఖి నుంచి తాగునీటి ప్రాజెక్టుకు రూ. 123 కోట్లతో టెండర్లు ఖరారయ్యాయన్నారు. లోచర్ల, రాముడువలస ఎత్తిపోతల పథకాలకు, గొల్లాది బ్రిడ్జికి మోక్షం కలిగిందన్నారు. పారాది వంతెన వచ్చే నెలాఖరుకు పూర్తి కానుందన్నారు. నియోజకవర్గంలో రోడ్డు బాగుపడ్డాయని, మున్సిపాలిటీ అభివృద్ధి పెద్దఎత్తున నిధులు మంజూరయ్యాయన్నారు. యువనేత లోకేశ్‌ ఇచ్చిన హామీ ప్రకారం బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు ఎమ్మెల్సీ కావడం ఖాయమ న్నారు. ఇద్దరం కలిసి చట్టసభలకు వెళ్తామని అభిమానుల కరతాళ ధ్వనుల మధ్య బేబీ నాయన ప్రకటించారు. ఫఅనంతరం బుడా చైర్మన్‌ తెంటు లక్ష్మునాయుడు మాట్లాడు తూ రెండేళ్లలో రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో లేనిపోని అపోహలు, ఆటంకాలు సృష్టించేంుకు కుటిలయత్నాలు సాగిస్తున్నారన్నారు. రానున్న మూడేళ్లలో బొబ్బిలి అభివృద్ధిలో పరుగులు తీస్తుందనడంలో సందేహం లేదన్నారు. సభలో బీజేపీ, జనసేన నియోజక వర్గ నేతలు పెంట స్వామినాయుడు, గిరడ అప్పలస్వామి, వేమకోటి శర్మ, మున్సిపల్‌ కమిషనర్‌ లాలం రామలక్ష్మి, తహసీల్దారు మలపురెడ్డి శ్రీను, ఎంపీడీవో రవికుమార్‌, అడ్మినిస్ర్టేటివ్‌ అధికారి డీవీ అప్పారావు, పంచాయితీరాజ్‌ డీఈఈ అప్పారావు, హౌసింగ్‌ డీఈఈ రెడ్డి వేణు గోపాలరావు, గ్రంథాలయ సంస్థ డైరెక్టర్‌ రౌతు రామ్మూర్తి, ఏఎంసీ చైర్మన్‌ నర్సుపల్లి వెంకటనాయుడు, అల్లాడ భాస్కరరావు, చింతల రామకృష్ణ, యజ్జల లక్ష్మి, గెంబలి శ్రీనివాసరావు, పువ్వల శ్రీనివాసరావు, కళింగ వైశ్య కార్పొరేషన్‌ డైరెక్టర్‌ సుంకరి సాయిరమేష్‌, వాసిరెడ్డి సత్యనారాయణ, పువ్వల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 23 , 2026 | 12:10 AM