Share News

జీవితంలో ఓడిపోయా..

ABN , Publish Date - Aug 30 , 2026 | 12:14 AM

‘మిత్రులారా.. మీ తో కలిసి పని చేశాను. నేను జీవితంలో ఓడిపోయాను. నా జీవన యాత్రను ముగిస్తున్నాను.

జీవితంలో ఓడిపోయా..

రాజాం రూరల్‌, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ‘మిత్రులారా.. మీ తో కలిసి పని చేశాను. నేను జీవితంలో ఓడిపోయాను. నా జీవన యాత్రను ముగిస్తున్నాను. నా చివరి కోరిక ఒకటి తీరు స్తారని కోరుకుంటున్నాను. మీరంతా సహకరించి వీలైనంత త్వరగా ఫార్మాలటీస్‌ పూర్తి చేయించి.. నా దహన సంస్కారాలు పూర్తి చేయిస్తారని కోరుకుంటున్నాను. నా శవాన్ని చూడడా నికి నా అన్నదమ్ములకు, వారి భార్యా పిల్లలకు అనుమతి ఇవ్వకండి. నా భార్య, పాపకు పూర్తి సహకారం అందించండి’ అని మొబైల్‌లో మెసేజ్‌ పెట్టి శనివారం వేకువజామున మాజీ జర్నలిస్ట్‌ అద్దంకి కృష్ణ అలియాస్‌ మధు తను నివశిస్తున్న అపార్ట్‌మెంట్‌ ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబీకుల తెలిపిన మేరకు వివరాలిలా..

మున్సిపాలిటీ పరిధిలోని మెంటిపేటకు చెందిన అద్దంకి కృష్ణ(45) దశాబ్ద కాలానికి పైగా ఓ ప్రముఖ దినపత్రికకు రాజాం విలేకరిగా పనిచేశారు. ఉన్నఫ లంగా అనారోగ్యానికి గురికావడం, పలు సర్జరీలు జరగడంతో కొన్నేళ్లుగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటికే పరిమితమైన ఆయనకు తన అన్నదమ్ముల నుంచి రావాల్సిన ఆస్తుల విషయంలో పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. కొన్ని ఆస్తులు కోర్టులో ఉన్నాయి. దీంతో కొన్నాళ్లుగా మానసిక ఆందోళనకు గురవుతూ జీవితాన్ని వెల్లదీస్తున్నారు. అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్న కృష్ణకు ఆయన భార్య నర్మద కొన్నేళ్లగా సపర్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా పెంచుకుంటున్న కుమార్తె నర్మదసాయికి ఫార్మసీలో సీటు రావడం, అందుకు కొంతమొత్తం అవసరం కావడంతో కృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అప్ప టికే అనారోగ్యంతో పాటు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కృష్ణ శని వారం వేకువజామున తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్‌ ఐదో ఫ్లోర్‌కు చేరకుని తన మొబైల్‌, హ్యాండ్‌స్టిక్‌ను అక్కడే విడచిపెట్టి పైనుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచారు. తన భర్త మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని, దీర్ఘకాలిక అనా రోగ్యం, గతంలో జరిగిన గుండె శస్త్రచికిత్స, తదనంతరం వచ్చిన పక్షవాతం కార ణంగా తీవ్ర నిరాశకు, అసహనానికి గురై ఆత్మహత్యకు చేసుకున్నారని మృతుడి భార్య నర్మద ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజాం ఎస్‌ఐ సల్మాన్‌ బేగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మిత్రుడు కృష్ణ చివరి కోరిక మేరకు రాజాం జర్న లిస్టులు అన్నీ తామై వ్యవహరించారు. గ్రామ పెద్దలు, కొంతమంది కుటుంబ సభ్యుల సహకారంతో కృష్ణ అంత్యక్రియలు జరిపించారు. కుటుంబానికి అండగా నిలుస్తామని మృతుడి భార్యకు హామీ ఇచ్చారు.

Updated Date - Aug 30 , 2026 | 12:14 AM