నేను బతికి.. మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టలేను
ABN , Publish Date - Nov 28 , 2026 | 11:50 PM
“I Can’t Let You Suffer Because of Me.” అనారోగ్యం.. వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు.. ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ’నేను బతికి ఉంటే మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టలేను.. నన్ను క్షమించండి‘ అంటూ చనిపోయే ముందు కుటుంబ సభ్యులతో చెప్పిన మాటలు వారిని తీవ్రంగా కలచివేశాయి.
చనిపోయే ముందు కుటుంబ సభ్యులతో ఆవేదన
పెదబుడ్డిడిలో విషాదం.. కన్నీరుమున్నీరైన కుటుంబం
జియ్యమ్మవలస, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): అనారోగ్యం.. వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులు.. ఆర్థిక ఇబ్బందులు.. వెరసి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ’నేను బతికి ఉంటే మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టలేను.. నన్ను క్షమించండి‘ అంటూ చనిపోయే ముందు కుటుంబ సభ్యులతో చెప్పిన మాటలు వారిని తీవ్రంగా కలచివేశాయి. ఈ ఘటన జియ్యమ్మవలస మండలం పెదబుడ్డిడిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పొగిరి వెంకటరమణ (58) వ్యవసాయ కూలిగా జీవనం సాగించేవాడు. భార్య, ఇద్దరు కుమారులు, కోడళ్లు, మనవడు, మనవరాలితో కలిసి ఉండేవాడు. నాలుగు నెలల కిందట బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఓ పైవ్రేట్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్సకు దాదాపు రూ.10 లక్షలు ఖర్చు చేశారు. కోలుకున్న కొద్దికాలానికే వెన్నునొప్పి మొదలైంది. ఆసుపత్రికి తీసుకెళ్లగా వెన్నులో నీరు చేరిందని, చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఇపఁటికే వైద్య ఖర్చులతో అప్పులపాలైన కుటుంబం.. మరోసారి డబ్బుల కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో మనస్తాపానికి గురైన వెంకటరమణ శుక్రవారం ఉదయం గడ్డి మందు తాగాడు. అస్వస్థతకు గురై వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఈ క్రమంలో ‘నన్ను క్షమించండి.. గడ్డి మందు తాగాను. నేను బతికి ఉంటే మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టలేను’ అని చెప్పాడు. వెంటనే కుటుంబ సభ్యులు పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.