మీ ఇంటి ఆడపడుచునే..
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:24 AM
‘నేను కూడా మీ ఇంటి ఆడపడుచునే.. మీరంతా సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఆశీర్వదించాల’ని కూట మి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి కోరారు.
ఓట్లేసి ఆశీర్వదించండి
కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి
విజయనగరం టౌన్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): ‘నేను కూడా మీ ఇంటి ఆడపడుచునే.. మీరంతా సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఆశీర్వదించాల’ని కూట మి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి కోరారు. సోమ వారం విజయనగరంలోని 51, 55, 56, 57వ డివిజ న్‌లలో స్థానిక ఎమ్మెల్యే అదితి గజపతిరాజుతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మా ట్లాడుతూ నగరంలో ఉన్న 62 డివిజన్లలో పూర్తి స్థాయి మౌలిక వసతులను కల్పించేందుకు శతశాతం కృషి చేస్తానన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడు తూ వైసీపీ నాయకులు ప్రజలను కళ్లబొల్లి మాటలు చెప్పి ప్రలోభాలకు గురిచేస్తారని, వాటిని అస్సలు నమ్మ వద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నా యకులు, వివిధ డివిజన్ల అభ్యర్థులు పాల్గొన్నారు.
విజయ ఢంకా మోగిస్తూ..
విజయనగరం, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): విజ యనగరం నగరపాలక సంస్థ కూటమి మేయర్ అభ్యర్థి అవనాపు భార్గవి ఎన్నికల ప్రచారంలో వినూ త్నరీతిలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం నగరంలో పండుగ నేపథ్యంలో భక్తజన సందోహం నడుమ ఆమె తన భర్త విజయ్‌తో కలిసి వినూత్నంగా ప్రచా రం నిర్వహించారు. పులివేషాల బృందంలో కలిసి కాసేపు ఆడారు. వారి దగ్గర ఉన్న ఢంకా తీసుకుని మోగిస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. తన మామ అవనాపు సూరిబాబు, ఆయన తండ్రి అచ్చన్న కాలం నుంచి తాము పులివేషాలను ఆదరించి, వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో కూ డా మరింత ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు.