Share News

హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయాలి

ABN , Publish Date - Apr 11 , 2026 | 12:15 AM

దుగ్గేరు వద్ద అనుమతులు మంజూరు చేసిన పంప్డు స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ను రద్దుచేయాలని ప్రాజెక్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ రాయల సుందరరావు కోరారు. శుక్రవారం మండలంలోని డెప్పిగుడ వద్ద ప్రాజెక్ట్‌ పోరాట వ్యతిరేక కమిటీ కోకన్వీనర్‌ అసిరి అధ్యక్షతన గిరిజనులతో సభ నిర్వహించారు.

 హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌ రద్దు చేయాలి
మాట్లాడుతున్న కన్వీనర్‌ రాయల సుందరరావు:::

సాలూరురూరల్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): దుగ్గేరు వద్ద అనుమతులు మంజూరు చేసిన పంప్డు స్టోరేజ్‌ హైడ్రోపవర్‌ ప్రాజెక్ట్‌ను రద్దుచేయాలని ప్రాజెక్ట్‌ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్‌ రాయల సుందరరావు కోరారు. శుక్రవారం మండలంలోని డెప్పిగుడ వద్ద ప్రాజెక్ట్‌ పోరాట వ్యతిరేక కమిటీ కోకన్వీనర్‌ అసిరి అధ్యక్షతన గిరిజనులతో సభ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ అనుమ తులు రదు ్దచేయకుంటే గిరిజనులంతా సంఘతంగా పోరాటం చేస్తారన్నారు. సురాపాడు రిజర్వా యర్‌ పూర్తి చేస్తే గిరిజనులకు మేలు జరుగుతుందన్నారు. రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి దంతులూరి వర్మ మాట్లాడుతు రాజ్యాంగ హక్కులను, పీసా చట్టం, 1/70 యాక్ట్‌ను ఉల్లఘించి బడా కంపెనీలకు హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లను కట్టబెట్టడం సరికాదన్నారు. ఈప్రాజెక్ట్‌ అనుమతులు రద్దుచేయాలని కోరారు. కార్యక్రమంలో మర్రిచెంచు, బోడి, నూకరాజు,ప్రసాద్‌, పెద్దసంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.

Updated Date - Apr 11 , 2026 | 12:15 AM