Share News

విదర్భపై హైదరాబాద్‌ విజయం

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:10 AM

స్థానిక విజ్జీ స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్‌-15 మహిళల వన్డే ట్రోఫీ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమ య్యాయి.

విదర్భపై హైదరాబాద్‌ విజయం

  • అండర్‌-15 మహిళల వన్డే ట్రోఫీ

విజయనగరం టౌన్‌, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): స్థానిక విజ్జీ స్టేడియంలో బీసీసీఐ ఆధ్వర్యంలో అండర్‌-15 మహిళల వన్డే ట్రోఫీ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభమ య్యాయి. హైదరాబాద్‌- విదర్భ జట్ల మధ్య తొలి మ్యాచ్‌ జరిగింది. విదర్భపై హైదరాబా ద్‌ 20 పరుగుల తేడాతో విజయం సాధించిం ది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ జట్టు 32.4 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. హైదరాబాద్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ శాన్వి 15 పరుగులు, లోయర్‌ ఆర్డర్‌ బ్యాటర్లు షేక్‌ అయేషా 19, అనన్య 20 పరుగులు సాధించారు. విదర్భ బౌలర్లలో ఆర్య నందన్వార్‌ 6.4 ఓవర్లలో 21 పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు సాధించింది. అనంతరం 112 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన విదర్భ జట్టు హైదరా బాద్‌ బౌలర్ల ధాటికి నిలవలేకపోయింది. 23.3 ఓవర్లలో 91 పరుగులకే ఆలౌటైంది. ఈ జట్టులో ఓపెనింగ్‌ బ్యాటర్‌ ఆర్య అభయ్‌ 39 బంతుల్లో 44 పరుగులు చేసింది. ఆమెకు సహకారం అందించే వారు లేకపోవడంతో జట్టు ఓటమి పాలైంది.

హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌..

మన్యం జిల్లా వాసే..

కురుపాం, జనవరి2(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ శాన్విది పార్వతీపురం మన్యం జిల్లానే. కొంతకాలం కిందట ఆమె కుటుంబం గుమ్మలక్ష్మీపురం మండలం రెల్ల గ్రామంలో ఉండేవారు. ఆమె తండ్రి ప్రవీణ్‌ రంజీ ప్లేయర్‌. తల్లి ఉద్యోగం చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా హైదరాబాద్‌లో ఉంటున్నారు. చిన్నతనం నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న శాన్వి తండ్రి ప్రోత్సాహంతో ఈ స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం ఆమె క్రికెట్‌లో రాణిస్తుండడంతో రెల్ల గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:10 AM