Share News

భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:14 AM

మండల కేంద్రమైన ఎస్‌.కోట పట్టణంలో చుక్క శ్రీను(45) తన భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడని సీఐ నారాయణమూర్తి శనివారం తెలి పారు.

 భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య

ఎస్‌.కోట రూరల్‌, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రమైన ఎస్‌.కోట పట్టణంలో చుక్క శ్రీను(45) తన భార్యతో గొడవపడి ఇంట్లో ఉన్న సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతిచెందాడని సీఐ నారాయణమూర్తి శనివారం తెలి పారు. సీఐ తెలిపిన వివరాలు ప్రకారం.. చుక్క శ్రీను మద్యానికి భానిసై ప్రతిరో జూ భార్యతో గొడవ పడుతుండేవాడు. ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి భార్యతో గొడవపడి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాక పోవడంతో భార్య, తన కుటుంబ సభ్యుల సహాయంతో తలపులు విరగొట్టి చూడ గా, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఉన్నాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా అప్పటికే శ్రీను మృతిచెందాడని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై భార్య సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:14 AM