భార్యపై భర్త దాడి
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:21 AM
పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రా మంలో కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యపై భర్తదాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.
బెలగాం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): పార్వతీపురం మండలంలోని నర్సిపురం గ్రా మంలో కుటుంబ కలహాల నేపధ్యంలో భార్యపై భర్తదాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. అవుట్‌పోస్టు పోలీసుల కథనం మేరకు.. కొమరాడ మండలంలోని గంగరాయవలసకు చెందిన రావాడ వెంకటలక్ష్మికి, నర్సిపురం గ్రామానికి చెందిన కిలపర్తి సుధీర్‌కు పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కుమార్తె ఉంది. పెళ్లైన సంవత్సరం తర్వాత నుంచి అదనపు కట్నం కోసం తనను భర్త, అత్త వేధిస్తున్నా డని బాధితురాలు పేర్కొనగా పెద్ద సమక్షంలో అనేక మార్లు పంచాయతీ జరి గింది. అయినా తన భర్త తీరులో మార్పు రాలేదని బాధితురాలు పేర్కొంది. ఈ నేపథ్యంలో తన జీవనం, జీవితం పరిస్థితిపై భార్య వెంకటలక్ష్మి తన భర్తను నిలదీయగా ఆమెపై అత్తతో కలిసి భర్త దాడి చేశారు. వెంటనే బాధితురాలిని తన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పార్వతీపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో గురువారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.