భార్యను హత్య చేసిన భర్త అరెస్టు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:13 AM
మండలంలోని ఈనెల 7వ తేదీన జరిగిన హత్య కేసును ఇన్‌చార్జి సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ వైవీ జనార్దన్ ఛేదించారు.
జామి, జూలై 11(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఈనెల 7వ తేదీన జరిగిన హత్య కేసును ఇన్‌చార్జి సీఐ నారాయణమూర్తి ఆధ్వర్యంలో ఎస్‌ఐ వైవీ జనార్దన్ ఛేదించారు. ఈ హత్యకేసుకు సంబంధించి శనివారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్ లో ఇన్‌చార్జి సీఐ నారాయణమూర్తి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండ లంలోని అలమండ గ్రామంలో ఒడిశా రాష్ట్రానికి చెందిన జోజింక సంధ్య అలియా స్ బారికి సంజయ్‌కుమార్, అతని భార్య రింకి బెహరాతో స్థానికంగా ఉన్న రాజు ల వీధిలో మూడు నెలలుగా నివాసం ఉంటున్నారు. అయితే భర్త సంజయ్‌కు గత కొన్ని రోజులుగా భార్యపై అనుమానం ఏర్పడింది. అప్పటి నుంచి నిరంతరం వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో ఆయన ఈనెల 7న భార్యను నోరు మూసి, గొంతు నులిమి చంపేసి.. తన మూడేళ్ల కుమారుడుతో పరార య్యాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంజయ్‌పై నిఘా వేశారు. శనివారం సాయంత్రం అలమండ రైల్వేస్టేషన్ వద్ద పట్టుకుని, అరెస్టు చేశారు.