హుండీ ఆదాయం రూ.6.73 లక్షలు
ABN , Publish Date - May 14 , 2026 | 12:23 AM
ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో హుండీలను బుధ వారం లెక్కించారు.
పాలకొండ, మే 13 (ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం కోటదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో హుండీలను బుధ వారం లెక్కించారు. పాలకొండ డివిజన్ ఆలయాల తనిఖీదారు ఎస్.రామారావు పర్యవేక్షణలో హుండీలను లెక్కించారు. మార్చి 25 నుంచి మే 13 వరకు హుండీల ద్వారా రూ.6 లక్షల 73 వేల 482 రూపాయలు ఆదాయం అమ్మ వారికి సమకూరిందని ఆలయ ఈవో వి.వి.సూర్యనారాయణ తెలిపారు. అలాగే మిక్స్డ్ బంగారం 15 గ్రాములు, మిక్స్డ్ వెండి 550 గ్రాములు లభించిందన్నారు. హుండీల లెక్కింపు కార్య క్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాదశర్మ, జూనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.