Share News

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఆడబిడ్డలకు వరం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:01 AM

గర్భాశ య క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఆడబి డ్డలకు వరమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు.

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఆడబిడ్డలకు వరం

  • ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి

  • వ్యాక్సినేషన్‌ కార్యక్రమం ప్రారంభం

లక్కవరపుకోట, మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గర్భాశ య క్యాన్సర్‌ నుంచి రక్షణ కల్పించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఆడబి డ్డలకు వరమని ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. సోమవారం స్థానిక పీహెచ్‌సీలో ఆమె హెచ్‌ పీవీ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. 14 ఏళ్లు నిండి 15 ఏళ్లలోపు బాలికలు తప్పనిసరిగా ఈ టీకాను తీసుకో వాలన్నారు. ఆసుపత్రిలో మూడు నెలల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వైద్యుడు బి.అ నీల్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీ టీసీ కరెడ్ల ఈశ్వరరావు, దాసరి కార్పొరేషన్‌ చైర్మన్‌ రత్నాజీ ఎంఈవో శ్రీనివాస్‌, కల్లేపల్లి పీహెచ్‌సీ వైద్యులు అజయ్‌కుమార్‌, తేజ, ఆర్‌ఐ సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 10 , 2026 | 12:01 AM