Share News

How was the immersion... Lord Ganesha? నిమజ్జనమెలా...గణపయ్యా?

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:02 AM

How was the immersion... Lord Ganesha? వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి అనుకుని వున్న రావెల చెరువిది. ఏటా ఈ చెరువులో ఈ గ్రామంతో పాటు పక్కనున్న సోంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దపెద్ద వినాయక ప్రతిమల నిమజ్జనం జరుగుతుంటుంది. పది నుంచి ఇరవై ప్రతిమలను ఈచెరువులోనే వదులుతారు.

How was the immersion... Lord Ganesha?  నిమజ్జనమెలా...గణపయ్యా?
చుక్కనీరు లేని వేపాడ మండలం అరిగిపాలెం సమీపంలోని రావెల చెరువు

నిమజ్జనమెలా...గణపయ్యా?

అరకొర వర్షాలకు చెరువుల్లో చేరని నీరు

నదుల్లోనూ అదే పరిస్థితి

అయోమయంలో ఉత్సవ కమిటీలు

నేడు చాలా చోట్ల నిమజ్జనాలు

శృంగవరపుకోట, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి):

- వేపాడ మండలం అరిగిపాలెం గ్రామానికి అనుకుని వున్న రావెల చెరువిది. ఏటా ఈ చెరువులో ఈ గ్రామంతో పాటు పక్కనున్న సోంపురం గ్రామంలో ఏర్పాటు చేసిన పెద్దపెద్ద వినాయక ప్రతిమల నిమజ్జనం జరుగుతుంటుంది. పది నుంచి ఇరవై ప్రతిమలను ఈచెరువులోనే వదులుతారు. ఈ ఏడాది చెరువులో చుక్క నీరు లేదు. చుట్టు పక్కల చెరువుల్లోనూ ఇదే పరిస్థితి. ఈ గ్రామాల్లో విధికో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసిన యువత ప్రతిమలను ఎక్కడ అనుపుతారో అర్థం కావడం లేదు.

ఎల్‌నినో ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా చెరువుల్లో నీరు చేరలేదు. పల్లె, పట్టణమన్న తేడా లేకుండా ఎప్పట్లాగే వీధి, వీధినా భారీ విఘ్నేశ్వర ప్రతిమలను ఏర్పాటు చేశారు. వీటిని వేర్వేరు రోజుల్లో నిమజ్జనం చేసేందుకు ప్రణాళికలు తయారు చేసుకున్నారు. పోలీస్‌ శాఖ నుంచి అనుమతులూ తీసుకున్నారు. రోజువారీ పూజలు ఘనంగా చేస్తున్నారు. సంస్కృతిక ప్రదర్శనలూ ఏర్పాటు చేస్తున్నారు. అంతా బాగా జరుగుతోంది కానీ బొజ్జ గణపయ్యను ఈ ఏడాది ఎక్కడ నిమజ్ఞనం చేయాలో పాలుపోవడంలేదు. చెరువుల్లో మనిషి పాదం తడిచే స్థాయిలో కూడా నీరు లేదు. గత ఏడాది ఈ సమయానికి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా చెరువులు జలకళతో కనిపించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పొలాలన్నీ వరి చేనుతో పచ్చగా కనిపించాయి. చెరువులు, బావులు, బందలు, గోతులు ఇలా వేటిల్లో చూసినా వరద నీరు ఉండేది. వినాయక చవితి నుంచి నవరాత్రులు పూజించిన గణేషుడ్ని మేళ,తాళాలతో ఊరిగింపు చేసిన అనంతరం గ్రామాలకు ఆనుకుని ఉండే చెరువుల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అర్ధరాత్రి సమయంలో యువత ఈత కోడుతూ అనందపడేవారు. అయితే ఇదే సమయంలో కొంత మంది ప్రమాదాల బారిన పడిన వారు వున్నారు. ఈ ఏడాది కనీస స్థాయిలో కూడా నీళ్లు లేవు. అనుపోత్సవమెలా చేయాలన్న మీమాంస నిర్వాహకులను వెంటాడుతోంది. రిజర్వాయర్‌లు, కాలుష్యంగా మారిన చెరువులు, బందల్లో మాత్రమే నీరు కనిపిస్తోంది. రిజర్వాయర్‌లు అత్యధిక గ్రామాలకు దూరంగా ఉన్నాయి. దీంతో ప్రత్యామ్నాయంగా మరికి నీటి చెరువులే కనిపిస్తున్నాయి. అయితే వాటిల్లో నిమజ్జనం చేస్తే చర్మ వ్యాధులు, అంటురోగాలు వచ్చే ముప్పు ఉంది. దీంతో నిర్వాహకులకు నేటికీ స్పష్టత లేదు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఆదివారం అధికంగా నిమజ్జనాలు ఉన్నాయి. ఏడో రోజుకావడంతో పాటు ఆదివారం పడడంతో ఎక్కువ మంది నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు.

Updated Date - Sep 20 , 2026 | 12:02 AM