How Much Was Spent? నిధుల మంజూరెంత.. ఖర్చు ఎంత?
ABN , Publish Date - Jun 27 , 2026 | 11:53 PM
How Much Was Sanctioned, How Much Was Spent? గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శనివారం డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఈ రమాజ్యోతి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు.
వేతనాల చెల్లింపులు, సిబ్బంది తీరు తదితర అంశాలపై ఫిర్యాదులు
విచారణ చేపట్టిన అధికారులు
గరుగుబిల్లి, జూన్27(ఆంధ్రజ్యోతి): గరుగుబిల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణలపై జిల్లా యంత్రాంగం స్పందించింది. ఈ మేరకు శనివారం డీఈవో పి.బ్రహ్మాజీరావు ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ ఎంఈ రమాజ్యోతి పాఠశాలలో విచారణ చేపట్టారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులతో మాట్లాడి సమాచారాన్ని సేకరించారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, ఆర్‌వో ప్లాంటును పరిశీలించారు. భోజన పథకం సామగ్రి గదిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌వోఆర్ ప్లాంటు మరమ్మతులకు గురైనా ఎందుకు బాగు చేయలేదని హెచ్‌ఎం ఎం.తేజేశ్వరిని ప్రశ్నించారు. సెలవుల్లో ఉన్నా హెచ్ ఎంతో పాటు మిగిలిన సిబ్బందికి జీతం చెల్లింపులకు సిఫారసు చేయడం, నిధుల దుర్విని యోగం, విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడం తదితర అంశాలపై గరుగుబిల్లికి చెందిన పి.శ్రీనివాసరావు రీజనల్ జాయింట్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశా రన్నారు. ఈ మేరకు పూర్తిస్థాయిలో విచారించి.. వివరాలు సేకరించామని, ఆర్‌జేడీకి నివేదిక అంది స్తామని ఆమె వెల్లడించారు. ఆరోపణల్లో వాస్తవాలు తేలితే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ విచారణలో సీనియర్ సహాయకుడు ఎస్.సతీష్‌కుమార్, తదితరులు ఉన్నారు.
ఇదీ పరిస్థితి..
- జడ్పీ హైస్కూల్‌లో మెరుగైన సౌకర్యాల కల్పనకు గతేడాది కేంద్రం పీఎంశ్రీ కింద గరుగుబిల్లి పాఠశాలకు రూ. 2.80 లక్షలు మంజూరుచేసినట్లు సమాచారం. అయితే ఎంతమేర నిధులు మంజూరయ్యాయి..? ఏ మేరకు ఖర్చు చేస్తున్నారన్న దానిపై సంబంధిత హెచ్‌ఎం, ఉపాధ్యాయులు మౌనం దాల్చుతున్నారు. ఇదిలాఉండగా పాఠశాల వార్షికోత్సవానికి ప్రభుత్వం రూ. 20 వేలు మంజూరు చేసింది. అయితే ఈ నిధులు వెచ్చించలేదు. 9, 10 తరగతుల విద్యా ర్థుల నుంచి రూ. 600 చొప్పున వసూలు చేసి వార్షికోత్సవం నిర్వహించారనే ఆరోపణలు న్నాయి. ఈ జడ్పీ హైస్కూల్‌లో 6 నుంచి 10 తరగతుల్లో 276 మంది విద్యార్థులు చదువు తున్నారు.
- జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బ్యాంకింగ్, క్రాఫ్ట్, ఫ్యాషన్ డిజైన్‌లకు చెందిన ఉపాధ్యాయులు సమయ పాలన పాటించడం లేదు. విద్యార్థులకు ఎటువంటి ఇంటర్ షిప్ కార్యక్రమం నిర్వహించడం లేదు.విధులకు గైర్హాజరవుతూ సొంత పనులకే మొగ్గు చూపుతున్న వీరికి నెలవారీ జీతాలు అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా పాఠశాలలో బ్యాంకింగ్, ఫ్యాషన్ డిజైన్‌కు సంబంధించిన సామగ్రి కనిపించడం లేదు. ఇక్కడున్న ల్యాబ్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదు. మెరుగైన బోధనలో భాగంగా తరగతులకు ఇద్దరు ఉపాధ్యా యులున్నా.. విడిగా కాకుండా రెండు సెక్షన్లు కలిపి ఇక్కడ బోధిస్తున్నారు. బోధన తీరు బాగోలేక పోవడంతో పలువురు తల్లిదండ్రులు విద్యార్థుల తరగతుల సెక్షన్ మార్పు చేయాలని రెండేళ్ల నుంచి పాఠశాల చుట్టూ తిరుగుతున్నారు. కాగా పిల్లలకు ‘టీసీలు ఇచ్చి పంపించేస్తాం.’ అని ప్రధానోపాధ్యాయులకు బదులుగా ఒక ఉపాధ్యాయుడు.. బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.