‘ఇంకెన్నాళ్లకు వంతెన పూర్తిచేస్తారు?’
ABN , Publish Date - Apr 09 , 2026 | 12:31 AM
పూర్ణపాడు-లాబేసు వంతెనను ఇంకెన్నాళ్లకు పూర్తిచేస్తారని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
కొమరాడ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి): పూర్ణపాడు-లాబేసు వంతెనను ఇంకెన్నాళ్లకు పూర్తిచేస్తారని సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బుధవారం పూర్ణపాడు, లాబేసు గ్రామాల మధ్య నాగావళి వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్ణపాడు, లాబేసు వంతెన ప్రారంభించి నేటికి 20 ఏళ్లయిందన్నారు. మిగిలిన మూడు పిల్లర్లు నిర్మాణానికి ఇంకో 20 ఏళ్లు కావాలా అని ప్రశ్నిం చారు. 9 పంచాయతీలు, 40 గ్రామాలకు ఉపయోగమైన ఈ వంతెన నిర్మాణానికి పాలకులకు చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. వంతెన నిర్మాణం కోసం బి.ఆర్.అంబేద్కర్ జయంతి సందర్భంగా 14 నుంచి 20వ తేదీ వరకు రిలే నిరాహార దీక్షలు, 22న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్నారు.