Share News

treatment అమ్మా.. వైద్యం ఎలా ఉంది?

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:01 AM

how is the treatment going? ‘ అమ్మా.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయ్‌.. వైద్య పరీక్షలు అన్నీ చేయించుకున్నారా.. మందులు తీసుకున్నారా!’ అంటూ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ రోగులతో మాట్లాడారు. బుధవారం అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

  treatment  అమ్మా.. వైద్యం ఎలా ఉంది?
అన్నవరం పీహెచ్‌సీలో రోగులతో మాట్లాడుతున్న సబ్‌ కలెక్టర్‌

పాలకొండ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): ‘ అమ్మా.. వైద్య సేవలు ఎలా అందుతున్నాయ్‌.. వైద్య పరీక్షలు అన్నీ చేయించుకున్నారా.. మందులు తీసుకున్నారా!’ అంటూ సబ్‌ కలెక్టర్‌ పవార్‌ స్వప్నిల్‌ జగన్నాథ్‌ రోగులతో మాట్లాడారు. బుధవారం అన్నవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. పీహెచ్‌సీలోని గదులు, హాజరు రిజిస్టర్లు, వైద్య సేవల నిర్వహణ, పరిశుభ్రత, పారిశుధ్య పరిస్థితులను పరిశీలించారు. ఆరోగ్య కేంద్ర ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుధ్య ప్రమాణాలను పాటించాలని వైద్య సిబ్బందికి సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. అనంతరం రోగులతో నేరుగా మాట్లాడి.. వైద్య సేవలు, మందుల లభ్యత, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు , వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.

Updated Date - Sep 24 , 2026 | 12:01 AM