Share News

How is the cultivation done? సాగు ఎలా?

ABN , Publish Date - Jul 09 , 2026 | 12:22 AM

How is the cultivation done? అవే ప్రశ్నలు.. అవే సమాధానాలు! సభ్యులు ప్రస్తావించడం.. అధికారులు స్పందించడం! ప్రతిసమావేశంలోనే ఇదేతీరు! కానీ ఎక్కడి సమస్యలే అక్కడే! ఏళ్లు గడుస్తున్నాయిగానీ పరిష్కారం దొరకట్లేదు. ఇప్పడు మళ్లీ సమావేశం అవుతున్నారు. ఈసారైనా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారో.. వేచి చూడాలి మరి!

How is the cultivation done? సాగు ఎలా?

సాగు ఎలా?

ఖరీఫ్‌కు సిద్ధమవుతున్నా..పూడిక తీసే ఆలోచన ఉందా..

కంపుకొడుతున్న పల్లెలు..కానరాని పారిశుధ్య చర్యలు..

కార్డులిచ్చారు సరే.. ఎరువులు సంగతేంటీ..?

నేడు జిల్లా ప్రజాపరిషత్‌ సర్వసభ్య సమావేశం

అవే ప్రశ్నలు.. అవే సమాధానాలు! సభ్యులు ప్రస్తావించడం.. అధికారులు స్పందించడం! ప్రతిసమావేశంలోనే ఇదేతీరు! కానీ ఎక్కడి సమస్యలే అక్కడే! ఏళ్లు గడుస్తున్నాయిగానీ పరిష్కారం దొరకట్లేదు. ఇప్పడు మళ్లీ సమావేశం అవుతున్నారు. ఈసారైనా చిత్తశుద్ధితో వ్యవహరించి ప్రజల సమస్యలు పరిష్కరిస్తారో.. వేచి చూడాలి మరి!

విజయనగరం/ కంటోన్మెంట్‌ జూలై 8(ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో ప్రతిసారీ అధికారులు గణాంకాలు వల్లె వేస్తున్నారు. ప్రగతి పత్రాలను సభ్యులు ఇస్తున్నారు. అంతకుమించి ఏమీ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సభ్యులు ప్రస్తావించిన సమస్యలపై నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గురువారం జడ్పీ సమావేశమందిరంలో సర్వసభ్య సమావేశం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలోని కొన్ని సమస్యలు..

ఫ ఖరీఫ్‌ సీజన్‌కు సాగునీరుపై రైతుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షాభావం వల్ల చెరువులు, సాగునీటి ప్రాజెక్టులకు సరిపడా నీరు చేరలేదు. నీటి కాలువలు, పిల్ల కాలువలు పూడిక, పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. వీటిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ఫ ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. చాలా గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా ఉంది. గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు నిర్మించినా, అనుసంధాన కాలువలు ఉన్నా పూడిక తీయక మురుగు పేరుకుని పోతోంది. దోమలు, ఈగలు, ఇతర కీటకాలతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. కొన్నిచోట్ల కాలువల్లో వ్యర్థాలు తీసి ఒడ్డునే వేసి వదిలేస్తున్నారు. మళ్లీ ఇవే కాలువల్లోకి చేరుతున్నాయి. పల్లెల్లో ప్రజారోగ్యం ఉండాలంటే కాలువల్లో మురుగుతీసి దోమల నివారాణకు చర్యలు తీసుకోవాలి.

ఫ ప్రతిఏటా వరినాట్లు పడిన తరువాత రైతుకు అవసరమైన ఎరువుల విషయంలో కొరత వెంటాడుతోంది. జిల్లాలో వరిసాగు ఎక్కువ. కానీ మంజూరైన ఎరువులు తక్కువ ావటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఎరువుల పంపిణీకి కార్డులు జారీచేసి నూతన విధానానికి తెరలేపారు. ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుందోనని రైతులు ఆందోళనలో ఉన్నారు. అదిక మోతాదులో ఎరువుల వినియోగంపై అటు భూసాంధ్రత తగ్గటంతో పాటు ఇటు ప్రజలకు క్యాన్సర్‌ వంటి వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

ఫ జిల్లాలో చంపావతి, వేగావతి, సువర్ణముఖి, నాగావళి, వట్టిగడ్డ వంటి నదులు ఉన్నాయి. ఇవే జిల్లా ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. సాగునీరు అందిస్తున్నాయి. కానీ అధికారుల అలసత్వం వల్ల నదుల్లో అక్రమ తవ్వాకాలు చేపట్టి ఇసుకను తరలించుకుని పోతున్నారు. ఏకంగా ఊటబావుల చెంతనే గోతులు తవ్వేస్తున్నారు. దీంతో గ్రామాలకు తాగునీరు అందించే ఇన్‌ఫిల్టర్‌ బావులు కుంగిపోతున్నాయి. 500 మీటర్ల వరకు ఎలాంటి తవ్వకాలు జరపరాదనే నిబంధన ఉన్నా.. ఇసుకాసురులు పట్టించుకోలేదు. ఇన్‌ఫిల్టర్‌ బావుల వద్ద ఇసుక లేక పెద్దగోతులు పడటంతో అందులో వ్యర్థాలు, మురుగునీరు చేరుతోంది. ఇదేనీరు సమీప గ్రామాల ప్రజలకు అందుతోంది. ఇసుకను అక్రమరవాణా చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 12:22 AM