Bus? బస్సు ఎక్కేదెలా?
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:04 AM
How Can We Board a Bus? ఇది భామిని మండల కేంద్రంలోని బస్టాప్‌లో పరిస్థితి. నిత్యం ఇలానే విద్యార్థులు బస్సులు ఎక్కాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా వారు ఈ సమస్యతో సతమత మవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు.
భామిని, జూలై29(ఆంధ్రజ్యోతి): ఇది భామిని మండల కేంద్రంలోని బస్టాప్‌లో పరిస్థితి. నిత్యం ఇలానే విద్యార్థులు బస్సులు ఎక్కాల్సి వస్తోంది. కొన్నాళ్లుగా వారు ఈ సమస్యతో సతమత మవుతున్నా.. పట్టించుకునే వారే కరువయ్యారు. బస్సుల కొరతతో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాల, జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం సాయంత్రం పాఠశాలలు ముగిసిన తర్వాత బస్సుల కోసం వారంతా గంటల తరబడి నిరీక్షించారు. ఆ తర్వాత ఒక బస్సు రాగా.. దాన్ని ఎక్కేందుకు విద్యార్థులు పోటీపడ్డారు. మరికొందరు ఫుట్‌పాత్‌పై నిలబడి గమ్య స్థానాలకు చేరుకోవాల్సి వచ్చింది. ప్రమాదాలు సంభవించకముందే సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. దీనిపై పాలకొండ డిపో మేనేజర్ బి.సూర్యనారాయ ణమూర్తిని వివరణ కోరగా.. బస్సులు అందుబాటులోకి వస్తే ఆ రూట్‌లో అదనంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు.