Share News

Drink This Water? ఈ నీటిని ఎలా తాగేదీ?

ABN , Publish Date - Jun 25 , 2026 | 12:18 AM

How Can Anyone Drink This Water? సీతంపేట గ్రామంలో జేజేఎం కుళాయిల నుంచి బురద నీరు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటిని ఎలా తాగాలంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా జలజీవన్‌మిషన్‌లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాన్ని సరఫరా చేస్తున్నారు.

  Drink This Water?  ఈ నీటిని ఎలా తాగేదీ?
కుళాయిల నుంచి వస్తున్న బురదనీరు

  • ఆందోళనలో ప్రజలు

సీతంపేట రూరల్‌, జూన్‌24(ఆంధ్రజ్యోతి): సీతంపేట గ్రామంలో జేజేఎం కుళాయిల నుంచి బురద నీరు వస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ నీటిని ఎలా తాగాలంటూ ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా జలజీవన్‌మిషన్‌లో భాగంగా వంశధార నది నుంచి శుద్ధ జలాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే కొద్దిరోజులుగా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. దీంతో సీతంపేట గ్రామంతో పాటు చుట్టుప్రక్కల ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా బుధవారం సీతంపేటలో కుళాయిల నుంచి దుర్వాసనతో బురద నీరు వచ్చింది. దీంతో స్థానికులు మండిపడుతున్నారు. ఈనీటిని ఎలా వినియోగించాలని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరు తున్నారు. ఈ విషయంపై ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ సత్యంను వివరణ కోరగా... ‘ జేజేఎం పైప్‌లైన్లను శుభ్రం చేస్తుండడం వల్ల కుళాయిల నుంచి బురదనీరు వస్తుంది. రెండు రోజుల పాటు ఈ సమస్య ఉంటుంది.’ అని తెలిపారు.

Updated Date - Jun 25 , 2026 | 12:19 AM