ఇంటి పన్ను లక్ష్యాలను సాధించాలి
ABN , Publish Date - Mar 26 , 2026 | 12:00 AM
ఇంటి పన్ను, కుటుంబ సమగ్రసర్వే లక్ష్యాలను శతశాతం సాధించాలని, సచివాలయ రికార్డులను పక్కాగా నిర్వహించాలని చీపురు పల్లి డీఎల్‌డీవో కె.హేమసుందరరావు ఆదేశించారు.
రేగిడి, మార్చి 25 (ఆంరఽధజ్యోతి): ఇంటి పన్ను, కుటుంబ సమగ్రసర్వే లక్ష్యాలను శతశాతం సాధించాలని, సచివాలయ రికార్డులను పక్కాగా నిర్వహించాలని చీపురు పల్లి డీఎల్‌డీవో కె.హేమసుందరరావు ఆదేశించారు. బుధవారం మండలంలో ఉంగరాడ సచివాలయన్ని ఎంపీడీవో శ్యామలాకుమారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఉంగరాడ, అంబఖండి, గుళ్లపాడు, సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. సచివాలయ సిబ్బది మూమెంట్ రిజిస్టర్, స్వర్ణ పంచాయతీ రికార్డుల నిర్వహణ లోపాలపై మండి పడ్డారు. సిబ్బంది బయటకు వెళ్లితే రికార్డుల్లో పొందుపరచాలని, పాలనాపరమైన లక్ష్యా ల్లో వెనకబాటు ఉండరాదని తెలిపారు. అనంతరం మండలంలో 39 పంచాయతీల ఇంటి పన్నుల వసూళ్లపై ఎంపీడీవోతో సమీక్షించారు. ఆయన వెంట అంబఖండి, ఉంగరాడ, గుళ్లపాడు కార్యదర్శులు హేమసుందరరావు, గౌరమ్మ, ఆశాస్వాతి ఉన్నారు.