ఇంటి పన్నులు వసూలు చేయాలి: డీడీవో
ABN , Publish Date - Mar 04 , 2026 | 11:50 PM
ఇంటి పన్నులు వసూలు లక్ష్యాన్ని ఈనెల 31 తేదీలోగా పూర్తిచేయాలని డివిజినల్ డెవలప్‌మెంట్ అధికారి(డీడీవో) హేమసుందర రావు ఆదేశించారు.
రాజాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): ఇంటి పన్నులు వసూలు లక్ష్యాన్ని ఈనెల 31 తేదీలోగా పూర్తిచేయాలని డివిజినల్ డెవలప్‌మెంట్ అధికారి(డీడీవో) హేమసుందర రావు ఆదేశించారు. బుధవారం మండలంలోని పొగిరిలో ఇంటి పన్నులు వసూళ్లను పరిశీలించారు, పన్నులు వసూళ్ల విషయంలో సచివాలయ సిబ్బంది జాప్యం చేస్తు న్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. డివిజన్ పరిధిలో రూ.69 లక్షల 76వేలు వసూలుచేయవాల్సి ఉండగా ఇంతవరకు రూ.52 లక్షల 91వేలు మాత్రమే వసూలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో వి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పన్ను వసూళ్లు శతశాతం పూర్తికావాలి
రేగిడి, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల్లో ఇంటిపన్ను వసూళ్లు శతశాతం పూర్తి కావాలని చీపురుపల్లి డివిజన్ డవలప్‌మెంట్ అఽధికారి హేమసుందరరావు స్పష్టం చేశారు. వార్షిక ఏడాది ముగిస్తున్నా వసూళ్లులో 70శాతంలోపు ఉన్న 20 పంచాయతీలు గుర్తించి ఆయా సచివాలయ సిబ్బందిపై మండిపడ్డారు. బుధవారం అమదాలవలస పంచాయతీలో పర్యటించారు. అనంతరం రేగిడిలో సిబ్బందితో సమీక్షించారు. ఆయన వెంట ఇన్‌చార్జి డిప్యుటీ ఎంపీడీవో పోలినాయుడు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.
లక్ష్యం పూర్తిచేయండి: కమిషనర్
రాజాం, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): పన్నులు వసూళ్ల లక్ష్యలను పూర్తిచేయకపోతే కఠిన చర్యలు తప్పవని మునిసిపల్ కమిషనర్ ఎ.రామచంద్రరావు హెచ్చరించారు. మునిసిపాలిటీలోని వార్డుసచివాలయం పరిధిలో ఇంటి, ఖాళీ స్థలాల పన్నులు, కొళాయి బిల్లులు, వసూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రూ.4, 04 కోట్లు ఇంటిపన్నులు వేసూలుచేయల్సిఉండగా ఇంతవరకు రూ.2,52 కోట్లు మాత్రమే వసూలు చేసినట్లు తెలిపారు.ఆయనతోపాటు ఆర్‌ఐ బోను శ్రీను, ఈశ్వరమ్మ ఉన్నారు.