Share News

ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి

ABN , Publish Date - Sep 05 , 2026 | 12:28 AM

పీఎం జన్‌మన్‌ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యేకాధికారి జేవీఎస్‌ఆర్‌కేవీ ప్రసాద్‌ కోరారు.

 ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించాలి
పనులు పరిశీలిస్తున్న ప్రసాద్‌

  • జిల్లా ప్రత్యేకాధికారి ప్రసాద్‌

కురుపాం,సెప్టెంబరు4(ఆంధ్రజ్యోతి): పీఎం జన్‌మన్‌ పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని పార్వతీపురం మన్యం జిల్లా ప్రత్యేకాధికారి జేవీఎస్‌ఆర్‌కేవీ ప్రసాద్‌ కోరారు. శుక్రవారం కురుపాం మండలంలోని మొండెంఖల్‌, తదితర గ్రామాల్లో ప్రధానమంతి ఆవాస్‌ యోజన కింద మంజూరై నిర్మిస్తున్న ఇళ్ల పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఎం జన్‌మన్‌ పథకం అత్యంత వెనకబడిన గిరిజన కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేస్తుందని తెలిపారు. ప్రభుత్వ ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణాలు ప్రారంభించకపోవడం సరికాదన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారుడు పథకాన్ని సద్వినియోగం చేసుకుని త్వరితగతిన ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించాలని కోరారు. పనులు ప్రారంభించని లబ్ధిదారులను గుర్తించి ప్రత్యేక అవగాహన కల్పించాలని, పనులు వెంటనే ప్రారంభించి నిర్ణీత సమయంలో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రసాద్‌ సిబ్బందికి ఆదేశించారు. ప్రతి లబ్ధిదారుడితో సమన్వయం చేసుకుంటూ గృహ నిర్మాణాలు పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో హౌసింగ్‌ పీడీ ధర్మరాజు, ఈఈలు వెంకటరావు, సోమేశ్వ రరావు, ఏఈ అచ్చాయమ్మ, వర్కుఇన్‌స్పెక్టర్‌ రాజేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2026 | 12:28 AM