Share News

ఆహ్లాద కేంద్రాలుగా ఆసుపత్రులు

ABN , Publish Date - Apr 04 , 2026 | 11:30 PM

‘ఆసుపత్రులు అంటే కేవలం మందులు, రోగుల మూలుగులే కాదు. అవి మానసిక ఉల్లాసం.. ఆహ్లాదకర వాతావరణం కల్పిం చే కేంద్రాలుగా మారాలి.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేర్కొ న్నారు.

ఆహ్లాద కేంద్రాలుగా ఆసుపత్రులు
చిన్నారులను అభినందిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి

పార్వతీపురం, ఏప్రిల్‌ 4 (ఆంధ్రజ్యోతి): ‘ఆసుపత్రులు అంటే కేవలం మందులు, రోగుల మూలుగులే కాదు. అవి మానసిక ఉల్లాసం.. ఆహ్లాదకర వాతావరణం కల్పిం చే కేంద్రాలుగా మారాలి.’ అని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి పేర్కొ న్నారు. జిల్లా ఏర్పడి నాలుగు సంవత్సరాలు పూర్తికావ డంతో జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శనివారం ఆరోగ్యకళా వేదికను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రి అంటేనే చాలామంది భయపడ తారని, అలాంటి వాతావరణం నుంచి రోగులను, వారి సహాయకులను బయటపడడమే ఆరోగ్య కళా వేదిక ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఇక్కడ ప్రతిరోజూ సాయం త్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో మెడిటేషన్‌ చేసుకో వడానికి, నవ్వడానికి వీలుగా వీడియో ప్రదర్శనలు, సాంస్కృతిక కార్య్రకమాలు నిర్వహిస్తారన్నారు. కార్పొరేట్‌, ఇంటర్నేషనల్‌ ఆసుపత్రుల్లో కూడా లేని విధంగా, ప్రభు త్వ ఆసుపత్రులో ఇలాంటి వసతి కల్పించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుందన్నారు. ఈ ఆలోచనను కార్య రూపంలోకి తెచ్చిన డీసీహెచ్‌ఎస్‌, సూపరింటెండెంట్‌, ఆర్‌ఏవో, ఆసుపత్రి సిబ్బందిని కలెక్టర్‌ అభినందించారు. ఈ సందర్భంగా చిన్నారులు నిర్వహించిన సాంస్కృతిక కా ర్యక్రమాలను కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డితో పాటు అధికారులు తిలకించారు. హరిశ్చంద్ర పాత్ర వేసిన రామరాజును ప్రత్యేకంగా కలెక్టర్‌ అభినందించారు. ఉత్తమ వైద్యులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలను అందించారు. జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్న స్పెషలైజేడ్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌ విభాగం రాష్ట్రంలోనే ప్రథమ స్థానాన్ని సాధిం చింది. ఈ విభాగంలో సేవలు అందించిన వైద్యులు, సిబ్బందికి కలెకర్‌ అభినందించి ప్రశంసాపత్రాలను అం దించారు. రాష్ట్రంలోనే ప్రథమ స్థానం సాధించడం ఎంతో ఆనందంగా ఉందని, ఇదే స్ఫూర్తితో సేవలు అందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో భాస్కర రావు, డీసీహెచ్‌ఎస్‌ నాగభూషణరావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వై.నాగశివజ్యోతి, మున్సిపల్‌ కమిషనర్‌ పావని, పార్వతి, భారతి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 04 , 2026 | 11:30 PM