Horticulture Cultivation ఆరు వేల ఎకరాల్లో ఉద్యాన సాగు
ABN , Publish Date - Jun 23 , 2026 | 12:00 AM
Horticulture Cultivation Planned in 6,000 Acres జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యం రైతులపై ఎల్‌నినో ప్రభావం పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేడుతున్నారు. దీనిలో భాగంగా జీడిమామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, సీతాఫలం, పనస తదితర ఉద్యాన పంటల సాగుకు పూర్తి సహకారాన్ని అందించనున్నారు.
30 నుంచి గుంతల తవ్వకం
జూలై 10 నుంచి మొక్కలు నాటే కార్యక్రమం
పార్వతీపురం, జూన్ 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆరు వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు మన్యం రైతులపై ఎల్‌నినో ప్రభావం పడకుండా అధికారులు ముందస్తు చర్యలు చేడుతున్నారు. దీనిలో భాగంగా జీడిమామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, సీతాఫలం, పనస తదితర ఉద్యాన పంటల సాగుకు పూర్తి సహకారాన్ని అందించనున్నారు. జూన్ 30 నుంచి గుంతలు తవ్వకం, జూలై 15 నుంచి మొక్కలు నాటడం ప్రారంభిస్తారు. ఆ తర్వాత మొక్కలు సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, చిన్న, సన్నకారు రైతులు, అటవీ హక్కుల చట్టం లబ్ధిదారులు , ఉపాధి హామీ జాబ్‌కార్డు కలిగిన రైతులు ఉద్యాన తోటల సాగుకు అర్హులు. ప్రతి జాబ్‌కార్డుకు గరిష్టంగా నాలుగు లక్షల వరకు అంచనా వ్యయంతో సహకారాన్ని అందించనున్నారు. కనీసం 25 సెంట్లు నుంచి రెండు ఎకరాల 50 సెంట్ల విస్తీర్ణంలో తోటల పెంపకం చేపట్టవచ్చు. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ కార్య క్రమాన్ని చేపట్టనున్నారు. దీనిపై డ్వామా పీడీ రామచంద్రరావును వివరణ కోరగా.. ‘ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలను రైతులను సద్వినియోగం చేసుకోవాలి. ఉపాధి హామీ పథకం ద్వారా 6వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అర్హుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ, ఉద్యానశాఖల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభ మవుతుంది. ’ అని తెలిపారు.