Home Guards’ పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు కీలకం
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:13 PM
Home Guards’ Services Vital to Police Department పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని విశాఖపట్నం రీజియన్ కమాండెంట్ ఎ.జోషి తెలిపారు. సోమవారం పార్వతీపురం పట్టణంలో ఉన్న పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ మైదానంలో జిల్లా స్థాయి హోంగార్డులకు ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమాండెంట్ జోషి హోంగార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు.
బెలగాం, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): పోలీస్ శాఖలో హోంగార్డుల సేవలు అత్యంత కీలకమని విశాఖపట్నం రీజియన్ కమాండెంట్ ఎ.జోషి తెలిపారు. సోమవారం పార్వతీపురం పట్టణంలో ఉన్న పోలీస్ మల్టీ ఫంక్షన్ హాల్ మైదానంలో జిల్లా స్థాయి హోంగార్డులకు ప్రత్యేక పరేడ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కమాండెంట్ జోషి హోంగార్డుల గౌరవ వందనాన్ని స్వీకరించి, సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు. అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో హోంగార్డులకు దర్బార్ నిర్వహించి హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కల్పించారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ పాటిస్తూ పోలీస్ శాఖ ప్రతిష్టను పెంచేలా పనిచేయాలన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నారు. హోంగార్డుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. హోంగార్డుల దైనందిన విధులు సవాళ్లతో కూడుకున్నవేనన్నారు. అయితే ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఆరోగ్యభద్రత కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతో అవసరమన్నారు. ఈ కార్య క్రమంలో ఏఆర్ డీఎస్పీ థామస్‌రెడ్డి, హోంగార్డు రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు నాయుడు, రాంబాబు, ఆదినారాయణ, ఆర్‌ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.