Home entrances to Ugadi ఉగాదికి గృహ ప్రవేశాలు
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:15 AM
Home entrances to Ugadi జిల్లాలో మంజూరైన గృహాలన్నీ పూర్తి చేసి ఉగాది నాటికి ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. మండల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించామని, ఒకపై ప్రతి వారం సమీక్ష జరుగుతుందన్నారు.
ఉగాదికి గృహ ప్రవేశాలు
ఇళ్లను సిద్ధం చేయాలి
కలెక్టర్ రామసుందర్ రెడ్డి
విజయనగరం కలెక్టరేట్, జనవరి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో మంజూరైన గృహాలన్నీ పూర్తి చేసి ఉగాది నాటికి ప్రవేశాలకు సిద్ధం చేయాలని కలెక్టర్ రామసుందర్‌రెడ్డి ఆదేశించారు. మండల అధికారులకు లక్ష్యాలను నిర్దేశించామని, ఒకపై ప్రతి వారం సమీక్ష జరుగుతుందన్నారు. బుధవారం కలెక్టరేట్ నుంచి మండలాల వారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఇళ్ల పురోగతిపై ఆరా తీశారు. గృహ నిర్మాణాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల సహకా రాన్ని తీసుకోవాలన్నారు. వారం వారం నిర్మాణాల స్థాయి మారాలని, రూఫ్ లెవెల్‌లో ఉన్న వాటిని ముందుగా పూర్తి చేయాలని తెలిపారు. ఇసుక, సిమెంట్, స్టీల్ తదితర మెటీరియల్‌ను హౌసింగ్ పీడీ సమకూర్చాలని, అలాగే బోర్ల ద్వారా నీటి సదుపాయాన్ని కూడా కల్పించాలని సూచించారు. ఎంపీడీవోలు గృహ నిర్మాణాలకు అవసరమగు మౌలిక వసతులపై పిడికి నోటు పెట్టాలన్నారు. మునిసిపాల్టీలలో కూడా కౌన్సిలర్లతో మాట్లాడుకుని వేగంగా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలన్నారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ పీడీ మురళీమోహన్, నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు ఉన్నారు.
పాసు పుస్తకాల్లో తప్పులు సరి చేయడానికి ఆప్షన్
కొత్త పాసు పుస్తకాలలో తప్పులు ఉండే సరి చేయడానికి తహసీల్దార్ల లాగిన్‌లో ఆప్షన్ ఇచ్చినట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి తెలిపారు. తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు బుధవారం మాట్లాడారు. జిల్లాలో ఎంపిక చేసిన 12 గ్రామాల్లో పట్టాదారు పాసు పుస్తకాలను పరిశీలించి, తప్పులను సవరించి ఫిబ్రవరి నెలలో పంపిణీ చేయాలని చెప్పారు. బొబ్బిలి, గజపతినగరం, రేగిడి, రాజాం, గుర్ల, చీపురుపల్లి, నెల్లిమర్ల, భోగాపురం, విజయనగరం, ఎస్.కోట, ఎల్.కోట మండలాల్లో 12 గ్రామాల్లో పంపిణీ కోసం 3008 సవరించిన పాసు పుస్తకాలను పంపిణీ చేయాల్సి ఉంటుందన్నారు.