Share News

Home after seven months.. ఏడు నెలల తర్వాత ఇంటికి..

ABN , Publish Date - Jan 13 , 2026 | 12:17 AM

Home after seven months.. ఉపాధి కోసం వెళ్లి సైబర్‌ ముఠా మోసానికి గురైన విజయనగరం వైఎస్సార్‌ నగర్‌కు చెందిన గండబోయిన భువనేష్‌, దినేష్‌లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోమవారం సాయంత్రం 4.35 గంటలకు తమ నివాసానికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత వారిని చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఇన్నాళ్లూ పడిన బాధను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Home after seven months.. ఏడు నెలల తర్వాత ఇంటికి..

ఏడు నెలల తర్వాత ఇంటికి..

విజయనగరం చేరుకున్న భువనేష్‌, దినేష్‌

తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం

విజయనగరం రూరల్‌/ క్రైం జనవరి 12 (ఆంధ్రజ్యోతి): ఉపాధి కోసం వెళ్లి సైబర్‌ ముఠా మోసానికి గురైన విజయనగరం వైఎస్సార్‌ నగర్‌కు చెందిన గండబోయిన భువనేష్‌, దినేష్‌లు ఎట్టకేలకు ఇంటికి చేరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సోమవారం సాయంత్రం 4.35 గంటలకు తమ నివాసానికి చేరుకున్నారు. ఏడు నెలల తర్వాత వారిని చూసిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులే లేవు. ఇన్నాళ్లూ పడిన బాధను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు.

గండబోయిన భువనేష్‌, దినేష్‌లు ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒక ప్రకటన చూసి.. దరఖాస్తు చేసి.. ఉపాధి కోసం గత ఏడాది మే 9న థాయ్‌లాండ్‌ వె ళ్లారు. అక్కడ ఇంటర్వ్యూ ప్రక్రియ ముగిసిన వెంటనే వీరి తలకు ముసుగులు వేసి మయన్మార్‌ తరలించారు. ఈ విషయం మే 12న తల్లిదండ్రులకు తెలిసింది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, బంధువుల బాధ వర్ణనాతీతంగా మారింది. సైబర్‌ ముఠా చేతికి చిక్కిన వీరు బయట పడేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. మరోవైపు వారి తల్లిదండ్రులు, బంధువులు కూడా కేంద్ర, రాష్ట్ర మంత్రులను కలుస్తూ తమ వారిని క్షేమంగా ఇంటికి రప్పించాలని కోరుతూ వచ్చారు. అందరి ప్రయత్నంతో ఈ నెల 10న ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ అధికారిక ప్రక్రియంతా ముగించుకుని ఇళ్లకు బయలుదేరారు. సోమవారం సాయంత్రం ఇంటికి చేరుకున్నారు.

============

Updated Date - Jan 13 , 2026 | 12:17 AM