Share News

ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం

ABN , Publish Date - May 15 , 2026 | 12:12 AM

ఉపాధి నిధులతో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని ఉపాధి హామీ చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి గోపీచంద్‌ అన్నారు.

ఇంకుడు గుంతలకు ప్రాధాన్యం
పనులపై అవగాహన కల్పిస్తున్న గోపీచంద్‌

సీతానగరం, మే 14(ఆంధ్రజ్యోతి): ఉపాధి నిధులతో ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తున్నామని ఉపాధి హామీ చీఫ్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి గోపీచంద్‌ అన్నారు. గురువారం అప్పయ్యపేటలో పిల్ల సాగునీటి కాలువలు, ఇంకుడు గుంతుల పనులను ఆయన ప్రారంభించారు. మండలం లో 10 వేల పనులకు నిధులు మంజూరయ్యా యన్నారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తిచేయిం చేందుకు అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఇంకుడు గుంతుల నిర్మాణం పై వేతనదారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అధికారి శ్రీనివాసరావు, ఏపీడీ త్రివిక్రమరావు, ఏపీవో బాలకృష్ణ, పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 12:12 AM