Holding the Flag జెండా పట్టి.. సైకిల్‌తో కదిలి!
ABN , Publish Date - Aug 12 , 2026 | 11:46 PM
Holding the Flag, Riding the Bicycle! ‘ఎందరో మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. వారి పోరాటాలను నేటి తరం గుర్తించుకోవాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటి చెప్పేలా బుధవారం పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండా చేతపట్టుకుని సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు.
జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటి చెప్పేలా సైకిల్ ర్యాలీ
మహనీయుల త్యాగాలు, పోరాటాలను గుర్తుంచుకోవాలి: కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి
పార్వతీపురం, ఆగస్టు12(ఆంధ్రజ్యోతి): ‘ఎందరో మహనీయుల త్యాగాల వల్లే మనకు స్వాతంత్య్రం వచ్చింది. వారి పోరాటాలను నేటి తరం గుర్తించుకోవాలి.’ అని కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ముందస్తు స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటి చెప్పేలా బుధవారం పట్టణంలో చేపట్టిన సైకిల్ ర్యాలీని ఆయన ప్రారంభించారు. అనంతరం జాతీయ జెండా చేతపట్టుకుని సైకిల్ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. పాతబస్టాండ్ కూడలి నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు, యువత ‘భారతమాతకు జై’ అంటూ నినాదాలు చేస్తూ.. సుమారు 250 అడుగుల జాతీయ జెండాతో.. ఉత్సాహంగా ముందుకు సాగారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. 80వ స్వాతంత్య్ర దినోత్సవం, వందేమాతరం జాతీయగీతం 150వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో పలు కార్యక్ర మాలను నిర్వహిస్తామని తెలిపారు. దేశ అభివృద్ధిలో యువత, విద్యార్ధులు కీలక పాత్ర పోషించా లని పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర వేడుకల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ఈ సైకిల్ ర్యాలీలో ఐటీడీఏ పీవో వైశాలి, తదితరులు పాల్గొన్నారు.
పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు
స్వాతంత్య్ర వేడుకల కోసం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్‌లో సంబంధింత ఆధికారులతో ఆయన మాట్లాడుతూ... వేడుకల్లో ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. అధికారు లతో పాటు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ వైశాలి, డీఆర్వో హేమలత, ఆర్డీవో మాధురి తదితరులు పాల్గొన్నారు.