ఆగిఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొని..
ABN , Publish Date - Jul 08 , 2026 | 12:36 AM
ఎస్.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు.
ఎస్.కోట రూరల్, జూలై 7(ఆంధ్రజ్యోతి): ఎస్.కోట మండలం ముషిడిపల్లి పం చాయతీ, తాటిపూడి సమీపంలోని దొర్లపాలెం గ్రామం వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్.కోట నుంచి విజయనగరం వెళ్తున్న ఆర్టీసీ బస్సు దొర్లపాలెం గ్రామం వద్ద ఆగింది. ఇదే సమయంలో వెనుక నుంచి ఒక ద్విచక్రవాహనదారు డు వచ్చి బస్సు వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టాడు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు విశాఖపట్నం జిల్లా సింహాచలంకు చెందిన కోమ్మోజు మోహిత్‌కిరీటి(35)గా స్థానికులు గుర్తించారు. విషయం తెలిసిన వెంటనే సీఐ నారాయణమూర్తి ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరు, వివరాలు తెలుసుకున్నారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, వారు ఇచ్చిన వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.