Share News

నిద్రిస్తుండగా కారం కొట్టి.. కర్రలతో దాడి

ABN , Publish Date - Jul 14 , 2026 | 12:17 AM

లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం రాత్రి స్థల వివాదం తలెత్తి.. ఒక కుటుంబం, మరో కుటుంబంపై పైశాచిక దాడికి పాల్పడింది.

నిద్రిస్తుండగా కారం కొట్టి.. కర్రలతో దాడి

  • లక్ష్మీపురంలో కొట్లాట

  • నలుగురికి తీవ్ర గాయాలు

రేగిడి, జూలై 13(ఆంరఽధజ్యోతి): లక్ష్మీపురం గ్రామంలో ఆదివారం రాత్రి స్థల వివాదం తలెత్తి.. ఒక కుటుంబం, మరో కుటుంబంపై పైశాచిక దాడికి పాల్పడింది. రాత్రివేళలో కారం పోసి చేతికందిన కర్రలు, రాడ్డుతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఒక కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ సోమవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. కెంబూరు నారాయణరావు, కెంబూరు శ్రీనివాసరావులకు పక్క పక్క ఇళ్ల స్థలాలు ఉన్నాయి. నారాయణరావు తన స్థలంలో ఇంటి నిర్మాణం ఉండగా, ఈయన పక్కనే శ్రీనివాస రావుకు దాదాపు 12 సెంట్ల స్థలం ఉంది. ఈక్రమంలో నారాయణరావు ఇంటి వెనుక భాగంలో మట్టి దిబ్బలు వేయగా, ఈ స్థలం విషయంలో శ్రీనివాసరావు, నారాయణరావుల మధ్య ఇటీవల వివాదం నడుస్తోంది. దీంతో శ్రీనివాసరావు తన స్థలంలో కొలతలు వేసి, ఆదివారం మట్టిదిబ్బలు తీసేశాడు. దీంతో కోపోద్రిక్తులైన నారాయణరావు కుటుం బీకులు ఒక్కసారిగా విచక్షణా రహితంగా ప్రవర్తించారు. నారాయణరావుతో పాటు, ఆయన భార్య హేమలత, కుమారులు సూర్యప్రకాష్‌, హేమంత్‌నా యుడులు ఆదివారం రాత్రి శ్రీనివాసరావు కుటుంబీకులు నిద్రస్తున్న సమయంలో ఇంటిలోకి చొరబడి కారం చల్లి, చేతిలో ఉన్న రాడ్డు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శ్రీనివాసరావు, చంద్రశేఖర్‌లకు తలకు తీవ్ర గాయా లు కాగా, శ్రీనివాసరావు భార్య కల్యాణి చేతిభాగం తీవ్ర గాయం కాగా, మరో సోదరుడి కుమారుడు రాముకు గాయాలయ్యాయి. కుటుంబీకులు వెంటనే క్షతగా త్రులను 108లో రాజాం ఏరియా అసుపత్రిలో తరలించారు. శ్రీనివాసరావు, చంద్ర శేఖర్‌లకు మెరుగైన వైద్యానికి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించగా, మిగతా ఇద్దరు ఇక్కడ చికిత్స పొందుతున్నారు. సమచారం తెలసుకున్న రేగిడి ఎస్‌ఐ బాలకృష్ణ, సిబ్బంది ఘటన స్థలం, రాజాం ఆసుపత్రిని సందర్శించారు. దాడికి పాల్పడిన కెంబూరు నారాయణరావు, వారి కుటుంబీకులపై కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 14 , 2026 | 12:17 AM