ఏడీఏపై ఉన్నతాధికారుల విచారణ
ABN , Publish Date - Aug 29 , 2026 | 11:13 PM
గజపతినగ రం సబ్ డివిజన్‌లో గతంలో ఏడీఏగా పని చేసిన నిర్మలాజ్యోతిపై ఉన్నతాధికారులు శనివారం ప్రాథమిక విచారణ చేపట్టారు.
-హాజరైన వ్యవసాయశాఖ అధికారులు, ఫెర్టిలైజర్స్ డీలర్లు
-రాష్ట్ర కమిషనర్‌కు నివేదిక
గజపతినగరం, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): గజపతినగ రం సబ్ డివిజన్‌లో గతంలో ఏడీఏగా పని చేసిన నిర్మలాజ్యోతిపై ఉన్నతాధికారులు శనివారం ప్రాథమిక విచారణ చేపట్టారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయంలో ఆమెను విశాఖపట్నానికి చెందిన వ్యవసా యశాఖ జేడీ కె.అప్పలస్వామి విచారించారు. సబ్ డివిజన్ పరిధిలోని వ్యవసాయశాఖ అధికారులతో పాటు ఫెర్టిలై జర్స్ డీలర్లు కూడా హాజరయ్యారు. నిర్మలాజ్యోతి పలు అక్రమాలు పాల్పడినట్లు అభియోగాలు ఉన్నాయి. విధి నిర్వహణలో ఆమెకు ఏవోలు, ఏఈవోల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నా రు. దీనిపై గత ఏప్రిల్ 8న జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీటీ రామారావు విచారణ చేపట్టారు. అయినా వారిమధ్య సమన్వయం కుదరకపోవడంతో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సబ్ డివిజన్ పరిధిలోని గజపతినగరం, దత్తిరాజేరు, బొండపల్లి మండలాల్లో ఏడీఏ తన భర్తతో నకిలీ పురుగు మందులు విక్రయాలు చేపడు తున్నారని, ప్రైవేటు పెర్టిలేజర్స్ డీలర్లను భయపెట్టి అమ్మ కాలు చేపట్టారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆమెను జిల్లా భూసార పరీక్ష కేంద్రానికి బదిలీ చేశారు. దీనిపై ఆమె రాష్ట్ర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. తాను ఎటు వంటి అక్రమాలు, అవినీతికి పాల్పడలేదని, తనపై లేని పోని అభియోగాలు తోటి సిబ్బంది మోపారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు విశాఖపట్నం వ్యవసాయశాఖ జేడీ ముందుగా ఏడీఏ నిర్మలాజ్యోతిని విచారణ చేపట్టారు. అనంతరం ప్రైవేటు డీలర్లతో మాట్లా డారు.ఏవోలు, ఏఈవోల నుంచి వివరాలు రాబట్టారు. ప్రాథమిక నివేదికను రాష్ట్ర కమిషనర్‌కు అందిస్తామని జేడీ తెలిపారు. ఈ విచారణలో ప్రస్తుత ఏడీఏ శ్రీనివాసరావు, సీనియర్ అసిస్టెంట్ కొండబాబు తదితరులు పాల్గొన్నారు.