దేశీ వరిసాగుతో అధిక దిగుబడులు
ABN , Publish Date - Sep 10 , 2026 | 11:08 PM
దేశీ వరి సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించ వచ్చునని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రబంధకుడు ఎం.శ్రావణ్‌కుమార్ నాయుడు తెలిపారు.
కొమరాడ, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేశీ వరి సాగుతో రైతులు అధిక దిగుబడులు సాధించ వచ్చునని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రబంధకుడు ఎం.శ్రావణ్‌కుమార్ నాయుడు తెలిపారు. గురువారం చినకేర్జిల గ్రామంలో పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తక్కువ నీటితో పండే కంది, ఆముదం, సజ్జలు తదితర పంటలను సాగు చేయాలని సూచించారు. ఏక పంటకు బదులుగా బహుళ పంటలు సాగుచేస్తే ఏడాది పొడవునా ఆదాయం పొందవచ్చునన్నారు. రైతులు చేపట్టిన దేశీ వరి, కూరగాయలు, పప్పు ధాన్యాల సాగును ఆయన అభినందించారు. కార్య క్రమంలో ఎఫ్‌ఎంటిబి శ్రీరాం, ఇ.తవుడు, రైతులు పాల్గొన్నారు.