యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
ABN , Publish Date - Sep 20 , 2026 | 12:28 AM
ఆయిల్ ఫాం సాగుచేసే రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు.
రామభద్రపురం, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): ఆయిల్ ఫాం సాగుచేసే రైతులు తగిన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. శనివారం మండలంలోని కొట్టక్కిలో ఆయిల్ ఫాం రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల ఎంపిక, ఎరువులు, నీటి యాజమాన్యం, చీడపీడల సస్యరక్షణ, తదితర అంశా లపై రైతులు అవగాహన కల్పించుకోవాలన్నారు. దిగుబ డులు, అధిక ఆదాయంపై కూడా దృష్టిసారించాలని సూచిం చారు. ప్రభుత్వం ఉద్యానశాఖ ద్వారా ఆయిల్‌ఫాం మొక్క లను వందశాతం రాయితీపై అందిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో బొబ్బిలి ఉద్యాన వనశాఖ అధికారి మోహన్‌కృష్ణ, వీహెచ్‌ఏ స్వాతి, వీఏఏ సౌజన్య పాల్గొన్నారు.