Share News

గ్రామీణ రహదారులకు పెద్దపీట

ABN , Publish Date - Jan 23 , 2026 | 12:10 AM

గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసుతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే గ్రామీణ రహదారులను పెద్దఎత్తున నిర్మిస్తున్నామని ఎంఎస్‌ ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు.

గ్రామీణ రహదారులకు పెద్దపీట

  • మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

గంట్యాడ జనవరి 22(ఆంధ్రజ్యోతి) గ్రామీణ ప్రాం తాల్లో మౌలిక వసుతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఇందులో భాగంగానే గ్రామీణ రహదారులను పెద్దఎత్తున నిర్మిస్తున్నామని ఎంఎస్‌ ఎంఈ, సెర్ప్‌, ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. మండలంలోని రావివల స నుంచి రామవరం వరకూ చెంచువాని, తమ్మునా యుడు చెరువు మీదుగా రూ.1.5కోట్ల ఉపాధి హామీ నిధులతో నిర్మిస్తున్న పంచాయతీ రోడ్డుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ రహదారులను విస్మరించిందన్నారు. ఎంపీపీ పీరుబండి హైమావతి, తహశీల్దార్‌ నీలకంఠేశ్వరరెడ్డి, ఎంపీడీవో రమణమూర్తి, పీఆర్‌ జేఈ కృష్ణమూర్తి, సర్పంచ్‌ సత్యవతి, టీడీపీ మండల అధ్యక్షుడు కొండపల్లి భాస్కర్‌ నాయుడు, టీడీపీ నాయ కులు అల్లు విజయకుమార్‌, రంధి చినరాము నాయుడు, బూడి అప్పల నాయుడు, రంధి రామునాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 23 , 2026 | 12:10 AM