Share News

two more మరో రెండు!

ABN , Publish Date - Mar 25 , 2026 | 12:07 AM

Here are two more అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది.

  two more మరో రెండు!

  • ప్రస్తుత సమావేశాల్లోనే డీలిమిటేషన్‌ బిల్లు

  • 2011 జనాభా లెక్కల ప్రకారమే ప్రక్రియ

పార్వతీపురం, మార్చి24(ఆంధ్రజ్యోతి): అన్ని రాష్ర్టాల్లో లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే జిల్లాలో అదనంగా రెండు అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది. జిల్లాలో పార్వతీపురం (ఎస్సీ), సాలూరు(ఎస్టీ), కురుపాం (ఎస్టీ), పాలకొండ (ఎస్టీ) నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత మూడు ఎస్టీ, ఒకటి ఎస్సీ, రెండు జనరల్‌ నియోజకవర్గాలు ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వాటి పరిధిలో 15 మండలాలు ఉన్నాయి. ప్రస్తుతం పార్వతీపురం పురపాలక సంఘంతో పాటు బలిజిపేట, సీతానగరం, పార్వతీపురం మండలం ఒక నియోజకవర్గంగా ఉన్నాయి.

- నియోజక వర్గాల పునర్విభజన జరిగిన తర్వాత బలిజిపేట, సీతానగరం మండలాలతో పాటు కురుపాం నియోకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలం కలిసి ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉందని సమాచారం.

- పార్వతీపురం పట్టణం, పార్వతీపురం మండలంతో పాటు కొమరాడ మండలాన్ని ఒక నియోజకవర్గంగా ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

- ప్రస్తుతం కురుపాం నియోజకవర్గంలో కొమరాడ, గరుగుబిల్లి, కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస మండలాలున్నాయి. అయితే కొమరాడ మండలాన్ని పార్వతీపురం నియోజకవర్గంలోకి, బలిజిపేట మండలాన్ని కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలోకి విలీనం చేసే అవకాశం ఉంది.

- పాలకొండ నియోజకవర్గం పరిధిలో పాలకొండ నగరపంచాయతీతో పాటు భామిని, సీతంపేట, పాలకొండ, వీరఘట్టం మండలాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో పాలకొండ మండలం ఒక నియోజకవర్గంగా ఏర్పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- సీతంపేట, భామిని మండలాల్లో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా పరిధిలో ఒక మండలాన్ని విలీనం చేసి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయనున్నట్లు ప్రాథమిక అంచనా.

- సాలూరు నియోజకవర్గం పరిధిలో సాలూరు పట్టణంతో పాటు విజయనగరం జిల్లా మెంటాడ, సాలూరు, మక్కువ, పాచిపెంట మండలాలు ఉన్నాయి. దీని పరిధిలో ఉన్న మెంటాడ మండలం గజపతినగరం నియోజకవర్గంలో కలిసిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే సాలూరు పట్టణం, పాచిపెంట, సాలూరు మండలాన్ని సాలూరు నియోజకవర్గం పరిధిలోనే ఉండనున్నాయి. మక్కువ మండలాన్ని మాత్రం మళ్లీ పార్వతీపురం నియోజకవర్గంలో విలీనం చేసే అవకాశం ఉంది.

- కురుపాం నియోజకవర్గం పరిధిలో ఉన్న గరుగుబిల్లి మండలాన్ని కొత్తగా ఏర్పడే నియోజకవర్గంలో విలీనం చేయకపోతే.. మక్కువ, సీతానగరం, బలిజిపేట మండలాలతో పార్వతీపురం నియోజకవర్గ స్వరూపం మారనుంది. ఇదే జరిగితే గరుగుబిల్లి మండలం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పరిధిలోకి వెళ్లే అవకాశం ఉందని అంచనా.

- మొత్తంగా జిల్లాలో అదనంగా రెండు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇందులో రిజర్వేషన్‌ ప్రాప్తికి సంబంధించి ఒక స్వరూపం తెచ్చేందుకు మండలాలు అటు, ఇటుగా మారే అవకాశం కూడా ఉంది.

జిల్లా యూనిట్‌గా పార్లమెంట్‌ స్థానం..

గతంలో పార్లమెంట్‌ నియోజకవర్గ కేంద్రంగా పార్వతీపురం ఉండేది. గత పునర్విభజన సమయంలో ఆ పేరును తొలగించేశారు. ప్రస్తుతం అరకు పార్లమెంట్‌ పరిధిలోనే జిల్లాలో నియోజకవర్గాలు ఉన్నాయి. తాజాగా కేంద్రం ప్రకటనతో ఇకపై జిల్లా యూనిట్‌గా తీసుకుని పునర్విభజన చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే జిల్లాలో పెరిగే నియోజకవర్గాలతో మళ్లీ పార్వతీపురం పార్లమెంట్‌ కేంద్రంగా ఏర్పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Updated Date - Mar 25 , 2026 | 12:07 AM