Share News

Here and There! ఇక్కడలా.. అక్కడలా!

ABN , Publish Date - Aug 21 , 2026 | 12:13 AM

Here and There! సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలను ఎన్నికల నుంచి మినహాయించినట్లు వస్తున్న వార్తలపై ఆయా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సాలూరు మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల పునర్వి భజన అంశంపై హైకోర్టులో రెండు కేసులు ఉన్నట్టు కమిషనర్‌ రత్నకుమార్‌ గురువారం తెలిపారు.

Here and There! ఇక్కడలా.. అక్కడలా!

  • న్యాయస్థానం తీర్పుకోసం ఎదురుచూపు

  • పార్వతీపురంలో లైన్‌క్లియర్‌

సాలూరు, ఆగస్టు20(ఆంధ్రజ్యోతి): సాలూరు, పార్వతీపురం మున్సిపాల్టీలను ఎన్నికల నుంచి మినహాయించినట్లు వస్తున్న వార్తలపై ఆయా అధికారులు స్పష్టత ఇచ్చారు. ఈ మేరకు సాలూరు మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల పునర్వి భజన అంశంపై హైకోర్టులో రెండు కేసులు ఉన్నట్టు కమిషనర్‌ రత్నకుమార్‌ గురువారం తెలిపారు. న్యాయ స్థానం తీర్పు మేరకు ఎన్నికల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం మున్సిపాలిటీలో 29 వార్డులు ఉండగా వాటిని 32 చేసేందుకు గానూ కసరత్తు చేయగా జనాభా పెరగలేనందున వార్డుల పునర్విభజనపై పట్టణానికి చెందిన కొంతమంది హైకోర్టును ఆశ్రయిం చారన్నారు. దీనిపై న్యాయస్థానం నుంచి తీర్పు రావాల్సి ఉందని తెలిపారు. ఏదేమైనా కోర్టు తీర్పు ప్రకారమే ఎన్నికల ప్రక్రియ మొదలు కానుందని కమిషనర్‌ తెలిపారు.

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

పార్వతీపురం టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పుర ఎన్నికల నిర్వహిస్తామని కమిషనర్‌ శ్రీనివాసరాజు తెలిపారు. వార్డుల పునర్విభజనపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు అందించా మన్నారు. వార్డుల పెంపుపై కోర్టును ఎవరైనా ఆశ్రయించినట్లయితే.. తమ వరకు రాలేదున్నారు. ఏదేమైనా పుర ఎన్నికలకు మున్సిపల్‌ యంత్రాంగం సిద్ధంగా ఉందని వెల్లడించారు.

Updated Date - Aug 21 , 2026 | 12:13 AM