‘Helping Hands’ రోగులకు ‘హెల్పింగ్ హ్యాండ్స్’
ABN , Publish Date - Jan 06 , 2026 | 12:05 AM
‘Helping Hands’ for Patients ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట జిల్లాలో మరొక వినూత్న సేవా కార్యక్రమం చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే గిరిజనులు, ఇతర రోగులకు అవసరమైన సహకారం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఆసుపత్రులకు వచ్చేవారికి వలంటీర్ల సాయం
నేడు సీతంపేటలో ప్రారంభించనున్న మంత్రి సంధ్యారాణి
పార్వతీపురం, జనవరి5(ఆంధ్రజ్యోతి): ‘హెల్పింగ్ హ్యాండ్స్’ పేరిట జిల్లాలో మరొక వినూత్న సేవా కార్యక్రమం చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వైద్యం కోసం వచ్చే గిరిజనులు, ఇతర రోగులకు అవసరమైన సహకారం అందించడమే దీని ముఖ్య ఉద్దేశం. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి శ్రీకారం చుట్టిన ఈ కార్యక్రమాన్ని మంగళవారం సీతంపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మొదటి దశలో పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రితో పాటు సీతంపేట, పాలకొండ, సాలూరు ఏరియా ఆసుపత్రుల్లో ‘హెల్పింగ్ హ్యాండ్స్’ను అమలు చేయ నున్నారు. రోగులకు సేవలందించేందుకు ఇప్పటికే సుమారు 800 మంది వలంటీర్లుగా రిజిస్ర్టేషన్ చేసుకున్నారు. వారు ఆసుపత్రులకు వచ్చే రోగులను రిసీవ్ చేసుకుని .. అవసరమైన సహకారం అందిస్తారు. వైద్య చిక్సితలు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి చేరకునే వరకు అన్నీ చూసుకుంటారు. ఇన్‌పేషెంట్లకు కూడా స్వచ్ఛందంగా సాయమందిస్తారు. ‘హెల్పింగ్ హ్యాండ్స్’ రిజిస్ర్టేషన్ ప్రక్రియ ప్రారంభమైంది.. ఎవరైనా వలంటీర్లుగా చేరవచ్చు. ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది.’ అని డీసీహెచ్‌ఎస్ నాగభూషణరావు సోమవారం చెప్పారు. ‘ సహాయకులు లేక.. వైద్యసేవలు తదితర వివరాలు తెలుసుకోలేక ఆసుపత్రులకు వచ్చిన వారిలో ఎంతోమంది తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. ఇటువంటి వారికి సాయమందించాలనే ఉద్దేశంతో ‘హెల్పింగ్ హ్యాండ్స్’కు శ్రీకారం చుట్టాం. ఇప్పటికే ట్రయల్ రన్ నిర్వహించాం. ఈ కార్యక్రమం రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో వలంటీర్లతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భాగస్వామ్యం కానున్నారు. మంత్రి సంధ్యారాణి నేడు సీతంపేటలో ఆసుపత్రిలో ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.’ అని కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు.