Share News

Helmet హెల్మెట్‌ ధారణ భారం కాదు బాధ్యత

ABN , Publish Date - Mar 31 , 2026 | 12:08 AM

Helmet Wearing is Not a Burden, It is a Responsibility హెల్మెట్‌ ఽధరించడం భారం కాదు బాధ్యతగా భావించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సోమవారం పార్వతీపురం పట్టణంలో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు.

Helmet  హెల్మెట్‌ ధారణ భారం కాదు బాధ్యత
అవగాహన ర్యాలీని ప్రారంభిస్తున్న ఐజీ

బెలగాం, మార్చి 30(ఆంధ్రజ్యోతి) : హెల్మెట్‌ ఽధరించడం భారం కాదు బాధ్యతగా భావించాలని విశాఖపట్నం రేంజ్‌ ఐజీ గోపీనాథ్‌ జట్టి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా సోమవారం పార్వతీపురం పట్టణంలో హెల్మెట్‌ వినియోగంపై అవగాహన ర్యాలీ ప్రారంభించారు. అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో విలేఖర్లతో ఆయన మాట్లాడుతూ.. ‘ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్‌ ధరించి సురక్షితంగా ప్రయాణించాలి. హెల్మెట్‌ లేక ఏటా రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మృతి చెందుతున్నారు. దీని వినియోగంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించాం. సైబర్‌ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ఎవరైనా ఆ తరహా మోసాలకు గురైతే.. వెంటనే పోలీసులకు తెలియజేయాలి. గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నాం.’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మాధవరెడ్డి, ఏఎస్పీ వెంకటేశ్వరరావు, ఏఎస్పీ మనీషా రెడ్డి, డీఎస్పీలు రాంబాబు, థామస్‌రెడ్డి, పార్వతీపురం పట్టణ సీఐ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 12:08 AM