Share News

Hello... Mom, I'm doing well. హలో .. అమ్మా నేను బాగున్నా

ABN , Publish Date - Aug 17 , 2026 | 12:19 AM

Hello... Mom, I'm doing well. గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ, నాన్నతో మాట్లాడాలనిపిస్తే ఇకపై ఎలాంటి ఇబ్బందీ లేదు. వారి కోసం ప్రభుత్వం ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదివరకు ఈ సదుపాయం లేదు.

Hello... Mom, I'm doing well. హలో .. అమ్మా నేను బాగున్నా
మడ్డువలస గురుకులంలో విద్యార్థులకు ఫోన్‌ సౌకర్యం

హలో .. అమ్మా నేను బాగున్నా

గురుకుల పాఠశాల విద్యార్థులకు ఫోన్‌ సదుపాయం

వంగర, ఆగస్టు16(ఆంధ్రజ్యోతి): గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మ, నాన్నతో మాట్లాడాలనిపిస్తే ఇకపై ఎలాంటి ఇబ్బందీ లేదు. వారి కోసం ప్రభుత్వం ఫోన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇదివరకు ఈ సదుపాయం లేదు.

వసతిగృహాల్లో ఉంటున్న పిల్లల యోగక్షేమాలు తెలుసుకోవటానికి కుటుంబ సభ్యులకు అవకాశం ఉండేదికాదు. ఎప్పుడో సెలవులకు వెళ్లేటప్పుడు తప్ప చూడటానికి, మాట్లాడటానికి అవకాశం లేని పరిస్థితి. లేదంటే తల్లిదండ్రులు పాఠశాలకు రావాలి. దీంతో విద్యార్థులు కూడా మానసికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాల్లో ఫోన్ల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఒక్కో పాఠశాలకు నాలుగు ఫోన్లను అందించింది. విద్యార్థి రూ.150తో రీచార్జి చేసుకోవచ్చు. తల్లి, తండ్రితో పాటు మరో మూడు నెంబర్లకు మాట్లాడే అవకాశం కల్పించారు. జిల్లాలోని ప్రతి గురుకులానికీ నాలుగు ఫోన్లు మంజూరు చేసినట్లు సంక్షేమాధికారి పద్మావతి తెలిపారు.

Updated Date - Aug 17 , 2026 | 12:19 AM