Share News

Food Commission Director! హలో.. నేను ఫుడ్‌ కమిషన్‌ డైరెక్టర్‌ను!

ABN , Publish Date - Apr 14 , 2026 | 12:38 AM

Hello… I am the Food Commission Director! ‘హలో.. నేను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నా.. మీ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. పిల్లలను మీరు పట్టించుకోవడం లేదు. ’ అని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని గడిచిన రెండు రోజులుగా అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి ఆశ్రమ పాఠశాల సిబ్బందికి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీంతో వారు తలలు పట్టుకుం టున్నారు.

 Food Commission Director! హలో.. నేను ఫుడ్‌ కమిషన్‌ డైరెక్టర్‌ను!

  • ఫిర్యాదులొచ్చాయని వేధింపులు

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): ‘హలో.. నేను రాష్ట్ర ఫుడ్‌ కమిషన్‌ డైరెక్టర్‌ను మాట్లాడుతున్నా.. మీ పాఠశాలలో మెనూ సక్రమంగా అమలు కావడం లేదు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టడం లేదు. పిల్లలను మీరు పట్టించుకోవడం లేదు. ’ అని విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని గడిచిన రెండు రోజులుగా అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి ఆశ్రమ పాఠశాల సిబ్బందికి ఫోన్‌ కాల్స్‌ వస్తున్నాయి. దీంతో వారు తలలు పట్టుకుం టున్నారు. అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి మాట్లాడే వ్యక్తి ... పిల్లలకు పెట్టే మెనూ వివరాలు స్పష్టంగా చెప్పడం, ఆర్‌వో ప్లాంట్‌ ఎలా పనిచేస్తున్నాయని ఆరా తీయడంతో పాటు పాఠశాల సిబ్బంది వ్యక్తిగత వివరాలు కూడా అడుగుతున్నాడు. అంతేకాదు ‘ మీపై వచ్చిన ఫిర్యాదుల మేరకు సెస్పండ్‌ చేస్తాం, ఆర్డర్‌ తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి ’ అని గట్టి స్వరంతో అన్‌నౌన్‌ పెర్సన్‌ మాట్లాడుతుండడంతో ఆశ్రమ పాఠశాలల సిబ్బంది హడలిపోతున్నారు. సీతంపేట గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల, పీఎల్‌ పురం పాఠశాలల హెచ్‌ఎం, హెచ్‌డబ్ల్యువోలతో పాటు మరికొన్ని పాఠశాలల సిబ్బందికి కూడ శుక్రవారం నుంచి సోమవారం వరకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్‌ వచ్చినట్లు తెలిసింది. దీనిపై వారు ఐటీడీఏ ఏపీవో, డీడీలకు సమాచారం అందించారు. ఈ విషయంపై డీడీ అన్నాదొరను వివరణ కోరగా.. ఆశ్రమ పాఠశాలల సిబ్బందికి అన్‌నౌన్‌ నెంబర్‌ నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌ అన్ని ఫేక్‌వేనని తెలిపారు. దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని చెప్పారు.

Updated Date - Apr 14 , 2026 | 12:38 AM