Share News

Hello.. హలో.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?

ABN , Publish Date - May 15 , 2026 | 11:45 PM

Hello.. How Is Your MLA’s Performance? ‘హలో.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. కూటమి రెండేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నారా?’ అంటూ టీడీపీ అధిష్ఠానం నేరుగా ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. శుక్రవారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పలువురికి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వచ్చాయి.

Hello..   హలో.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది?

పార్వతీపురం, మే15(ఆంధ్రజ్యోతి): ‘హలో.. మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది.. కూటమి రెండేళ్ల పాలనపై సంతృప్తిగా ఉన్నారా?’ అంటూ టీడీపీ అధిష్ఠానం నేరుగా ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తుంది. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులపై ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తోంది. శుక్రవారం జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పలువురికి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ వచ్చాయి. మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి పనితీరుపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఏదేమైనా పార్టీ అధిష్ఠానం ఇలా ప్రజలకు ఐవీఆర్‌ఎస్‌కాల్స్‌ చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. జిల్లా ప్రజాప్రతినిధులను ప్రజలకు మరింత చేరువ చేయడానికి ఇటుంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా ప్రజా వ్యతిరేకత ఉన్న వారిపై అధిష్ఠానం ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం లేకపోలేదు.

Updated Date - May 15 , 2026 | 11:45 PM