Seethampeta Hospital సీతంపేట ఏరియా ఆసుపత్రికి రోగుల తాకిడి
ABN , Publish Date - May 04 , 2026 | 10:58 PM
Heavy Rush of Patients at Seethampeta Area Hospital సీతంపేట ఏరియా ఆసుపత్రికి సోమవారం రోగుల తాకిడి ఎక్కువైంది. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, వాంతులు వంటి లక్షణాలతో గిరిజనలు ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు.
సీతంపేట రూరల్, మే 4(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏరియా ఆసుపత్రికి సోమవారం రోగుల తాకిడి ఎక్కువైంది. వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరం, జలుబు, ఒళ్లునొప్పులు, వాంతులు వంటి లక్షణాలతో గిరిజనలు ఏరియా ఆసుపత్రిని ఆశ్రయించారు. ఓపీ 293వరకు నమోదు కాగా వీరిలో 46మంది వరకు వైరల్ జ్వరాలతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరి చికిత్సపొందుతున్నారు. వీరిలో చిన్నారులు కూడా ఉన్నారు. వైరల్ జ్వరాలతో బాధపడుతున్న రోగులు ఓపీ, రక్తపరీక్షల కోసం గంటల తరబడి ఆసుపత్రిలో ఉన్న మెట్లపై కూర్చుని నిరీక్షించారు. దీనిపై ఏరియా ఆసుపత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డీవీ శ్రీనివాస్ వద్ద ఆంధ్రజ్యోతి ప్రస్తావించగా ఏరియా ఆసుపత్రికి వైరల్ ఫీవర్ కేసులు ఎక్కువగానే వచ్చాయన్నారు. రోగులకు ఇబ్బందులు కలగకుండా మెరుగైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు.