Share News

విజయనగరంలో భారీ వర్షం

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:05 AM

విజయనగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు అల్లాడిపోయారు.

విజయనగరంలో భారీ వర్షం
విజయనగరం రోడ్డుపై చేరిన నీరు

విజయనగరం కంటోన్మెంట్‌, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): విజయనగరంలో బుధవారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 36 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుకావడంతో ప్రజలు అల్లాడిపోయారు. అయితే ఒక్కసారిగా మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఆకా శంలో కారుమబ్బులు కమ్ముకున్నాయి. అంతలోనేనగరంలో భారీ వర్షం కురిసింది. ఎల్‌నినో ప్రభావంతో ఇప్పటివరూ ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇంతలో కురి సిన వర్షంతో నగరంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. పలు లోతట్టుప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న అధికారులు యుద్దప్రాతిపదికన సమస్య పరిష్కరించారు. సాయంత్రం ఇంటికి వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు తడిసిముద్దయ్యారు.

Updated Date - Aug 13 , 2026 | 12:05 AM