Share News

Heavy Rain Alert జిల్లాకు భారీ వర్ష సూచన

ABN , Publish Date - Oct 25 , 2026 | 12:09 AM

Heavy Rain Alert for the District బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 27 నుంచి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశ ముందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్‌రూములు ఏర్పాటు చేసి పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో మందులు ఉంచాలన్నారు.

Heavy Rain Alert జిల్లాకు భారీ వర్ష సూచన

పార్వతీపురం, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈనెల 27 నుంచి 29 వరకు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశ ముందని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉండాలన్నారు. కంట్రోల్‌రూములు ఏర్పాటు చేసి పీహెచ్‌సీల్లో పూర్తిస్థాయిలో మందులు ఉంచాలన్నారు. వైద్య బృందాలు అందుబాటులో ఉండా లని, అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. గర్భిణులను ముందుగానే ఆసుపత్రులకు తరలించాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, వాగులు, చెరువులు దాటకుండా పటిష్ఠ చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా, మండల కేంద్రాల్లో కం ట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేయాలని, ఎన్నికల స్ర్టాంగ్‌ రూమ్‌ల్లోకి నీరు చేరకుండా చూడాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణకు అవసరమైన యంత్రాలు, సామగ్రిను సిద్ధంగా ఉంచాలన్నారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, పునరావాస కేంద్రాలు, తుపాను షెల్టర్లను సిద్దం చేయాలని, మత్స్యకారులు జలాశయాల్లో చేపలవేటకు వెళ్లాకుండా అవగాహన కల్పించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల మినహా 27, 28 తేదీల్లో వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని.. రోజువారీ నివేదికలు అందించాలని ఆదేశించారు.

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించొద్దు

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినా, శిక్షణా తరగతులకు గైర్హాజరైనా క్రమశిక్షణా చర్యలు తప్పవని కలెక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి హెచ్చరించారు. ఎన్నికల విధులకు ఎలాంటి మినహాయింపులు ఉండవని శనివారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. వైద్య అత్యవసరాలు లేదా బలమైన కార ణాలు ఉంటేనే మినహాయింపులను పరిశీలిస్తామన్నారు. తప్పుడు కారణాలతో విధులు నుంచి తప్పించుకోవాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి అధికారి, ఉద్యోగి బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు.

వెబ్‌సైట్‌లో పోలింగ్‌ కేంద్రం వివరాలు

రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ ద్వారా ఓటర్లు తమ పోలింగ్‌ కేంద్రం వివరాలను తెలుసుకోవచ్చునని కలెక్టర్‌ తెలిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు.

Updated Date - Oct 25 , 2026 | 12:09 AM