Strong Winds గాలులతో అపార నష్టం
ABN , Publish Date - May 23 , 2026 | 11:10 PM
Heavy Damage Due to Strong Winds జియ్యమ్మవలస మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శనివారం చినతోలుమండ గ్రామాన్ని సం దర్శించారు. దెబ్బతిన్న రేకిళ్లను పరిశీలించిన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
చినతోలుమండలో పర్యటించిన కలెక్టర్, ప్రభుత్వ విప్
తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశం
జియ్యమ్మవలస, మే23(ఆంధ్రజ్యోతి): జియ్యమ్మవలస మండలంలో శుక్రవారం సాయంత్రం వీచిన ఈదురుగాలులకు వందలాది ఎకరాల్లో అరటి, చెరకు పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి శనివారం చినతోలుమండ గ్రామాన్ని సం దర్శించారు. దెబ్బతిన్న రేకిళ్లను పరిశీలించిన బాధిత కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణతో పాటు అవసరమైన సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని కోరారు. అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిం చాలని ఆదేశించారు. అంతకుముందు కలెక్టర్ బీజే పురం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులను పరిశీలించి.. ప్రజలకు పారదర్శకమైన సేవలు వేగవంతంగా అం దించాలని సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ప్రజా సమస్యలను తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. వారి వెంట గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, ఎంపీపీ సురేష్, మండల స్థాయి అధికారులు తదితరులు ఉన్నారు.