Hearing Problems అధిక శబ్దంతో వినికిడి సమస్యలు
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:45 PM
Hearing Problems Due to Excessive Noise ఒక స్థాయికి మించిన శబ్దాల కారణంగా వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. ప్రపంచ వినికిడి దినం సందర్భంగా మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
పార్వతీపురం, మార్చి3(ఆంధ్రజ్యోతి): ఒక స్థాయికి మించిన శబ్దాల కారణంగా వినికిడి సమస్యలు వచ్చే అవకాశం ఉందని డీఎంహెచ్‌వో భాస్కరరావు తెలిపారు. ప్రపంచ వినికిడి దినం సందర్భంగా మంగళవారం వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిమితికి మించిన శబ్దాలు, ధ్వనులతో చెవులు దెబ్బతింటాయన్నారు. హెడ్‌సెట్స్, ఇయర్ బడ్స్, డీజే సౌండ్స్, శృతి మించిన హారన్స్‌తో వినికిడి సమస్యలు వస్తున్నాయని వెల్లడించారు. శబ్ద స్థాయి 80 డెసిబెల్స్‌కు మించకుండా చూసుకోవాలని సూచించారు. కొన్ని హెచ్చరిక సంకేతాలతో వినికిడి సమస్యలను గుర్తించొచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్‌సీడీపీవో టి.జగన్మోహన్‌రావు, డీఐవో వై.విజయమోహన్, ప్రోగ్రాం అధికారి సూర్యకౌశిక్ తదితరులు పాల్గొన్నారు.