Share News

గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ABN , Publish Date - Apr 13 , 2026 | 12:05 AM

జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శాఖలోని డీసీఆర్‌బీ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.జగదీశ్వరరావు శనివారం గుండెపోటుతో మృతిచెం దారు.

గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

విజయనగరం క్రైం, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పోలీస్‌ శాఖలోని డీసీఆర్‌బీ విభాగంలో హెడ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఎ.జగదీశ్వరరావు శనివారం గుండెపోటుతో మృతిచెం దారు. ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ ఆదివారం జగదీశ్వరరావు భౌతిక కాయాన్ని సందర్శించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పోలీస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శ్రీనివాసరావు, డీఎస్పీ ఆర్‌.గోవిందరా వు, డీసీఆర్‌బీ సీఐ కె.కుమారస్వామి, ఒకటవ పట్టణ సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, ట్రాఫిక్‌ సీఐ సూరినాయుడు, రూరల్‌ సీఐ లక్ష్మణరావు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2026 | 12:05 AM