Share News

దుక్కు దున్నేందుకు వెళ్లి..

ABN , Publish Date - Aug 07 , 2026 | 12:18 AM

ఆయనే ఆ కుటుంబానికి ఆధా రం. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

దుక్కు  దున్నేందుకు వెళ్లి..

  • చెట్టును ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో డ్రైవర్‌ మృతి

  • అగమ్య గోచరంగా మారిన కుటుంబం పరిస్థితి

జామి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ఆయనే ఆ కుటుంబానికి ఆధా రం. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దుక్కు దున్నేందుకు వెళ్లిన ఆయన.. ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ చెట్టును ఢీకొన్న ఘటనలో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఘటనపై స్థానిక పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండ్రంగి గ్రామానికి చెందిన కొమ్మినేని ఎర్నిబాబు(38) గురువారం ఉదయం గ్రామ సమీపంలోని ఓ పొలంలో ట్రాక్టర్‌తో దుక్కు దున్నేందుకు వెళ్లాడు. పని పూర్తయి న అనంతరం మరో రైతుకు చెందిన పొలంలో దుక్కు దున్నేందుకు ట్రాక్టర్‌ను రోడ్డు ఎక్కిస్తున్న సమయంలో ట్రాక్టర్‌ వెనక్కి జారి చెట్టును ఢీకొట్టింది. ఈక్రమం లో ఆయన స్టీరింగ్‌కు బలంగా ఢీకొన్నాడు. అపస్మారక స్థితికి చేరిన ఎర్నిబాబును వెంటనే స్థానికులు 108 వాహనంలో విజయనగరం మహారాజా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య సత్యవతి, డిగ్రీ చదువుతున్న కూతురు తోపాటు తల్లిదండ్రులు సన్నిబాబు, కొండమ్మ ఉన్నారు. ఎర్నిబాబు సంపాదనతోనే కుటుంబం నడుస్తోంది. ఇతని మృతితో కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఎర్నిబాబు మృతితో గ్రామంలో విషాధ ఛాయాలు అలముకున్నాయి. ఈ ఘటనపై అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - Aug 07 , 2026 | 12:18 AM