పనుల్లో తొందర.. నాణ్యతకు పాతర!
ABN , Publish Date - Jul 31 , 2026 | 12:43 AM
బలిజి పేట మండలం పెదపెంకి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి.
పెదపెంకి అభివృద్ధి పనుల్లో లోపాలు
నిగ్గుతేల్చిన క్వాలిటీ కంట్రోల్ బృందం
వ్యవహారం డిప్యూటీ సీఎం దృష్టికి..
సీతానగరం (బలిజిపేట), జూలై 30(ఆంధ్రజ్యోతి): బలిజి పేట మండలం పెదపెంకి గ్రామంలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యత లోపాలు కనిపిస్తున్నాయి. పనులను వేగంగా పూర్తి చేయాలనే తొందరలో నాణ్యతా ప్రమాణాలు విస్మరిం చారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. బోద వ్యాధి నివారణలో భాగంగా పెదపెంకిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేం దుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సుమారు రూ.6 కోట్లు మంజూరు చేశారు. ఆ నిధులతో మ్యాజిక్ డ్రైన్లు, రహదారుల నిర్మాణాలు చేపట్టారు. మొత్తంగా 66 కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం 24 సీసీ రోడ్లు, ఆరు కాలువల పనులు వివిధ దశల్లో కొనసాగుతు న్నాయి. కాగా ఈ నిర్మాణాలపై విమర్శలు వెల్లువెత్తగా... ఈ విషయం డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఇటీవల క్వాలిటీ కంట్రోల్ బృందం అధికారులు క్షేత్ర స్థాయిలో పనులు పరిశీలించి.. నిర్మాణాల్లో నాణ్యత లో పాలు ఉన్నట్లు గుర్తించారు. దీనిపై నివేదిక అందించ డంతో డిప్యూటీ సీఎం పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లులు నిలిపివేసి.. కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవా లని ఆదేశాలు జారీ చేశారు. గడువులోగా నాణ్యత ప్రమా ణాలకు అనుగుణంగా పనులు పూర్తిచేయాలని జిల్లా యం త్రాంగానికి సూచించారు. ఈ అంశంపై పంచాయతీరాజ్ డిప్యూటీ ఎగ్జిక్యూ టివ్ ఇంజనీర్ జి.శంకరరావును వివరణ కోరగా.. ఇటీవలే బాధ్యత లు స్వీకరించాన తెలిపారు. పనుల నాణ్యతను పూర్తిస్థాయిలో పరిశీలించి.. తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.